బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక్కడ కూడా ఆమెకి మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'లిబర్టీ : ఎ కాల్ టు స్పై' అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె బ్రిటీష్ స్పై గా కనిపించనున్నారు.

తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది రాధికా.. బ్రిటీష్ స్పై నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రను పోషించే ఛాన్స్ వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. అదే సమయంలో భారతీయ చిత్రాలకు, హాలీవుడ్ చిత్రాలు మధ్య తేడాలు గమించానని చెప్పింది. హాలీవుడ్ లో నటులు తమ డబ్బు కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉండదని చెప్పింది.

హాలీవుడ్ జనాలు ప్రతీ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారని.. సరైన సమయంలో పేమెంట్ చేస్తుంటారని.. నా డబ్బులు ఇవ్వండని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చింది. రాధికా ఆప్టే తన మాటలతోహాలీవుడ్ ని పొగుడుతూనే ఇండియన్ ఇండస్ట్రీని కించపరిచింది. ఇక్కడ మనుషులు కచ్చితంగా ఉండరని, డబ్బుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని పరోక్షంగా పంచ్ లు వేసింది.

ఇక సినిమా విషయానికొస్తే.. స్పై పాత్ర కోసం రాధికా ఎన్ని పుస్తకాలు, క్లాసిక్ నవలలు చదివానని, స్పై సినిమాలు చూశానని చెప్పింది. ''లిబర్టీ : ఎ కాల్ టు స్పై'చిత్రాన్ని మైకేల్ వింటర్ బాటమ్ డైరెక్ట్ చేస్తున్నారు. దేవ్ పటేల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.