వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

By narsimha lodeFirst Published Jul 30, 2019, 4:54 PM IST
Highlights

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు సిద్దార్ధ అదృశ్యంపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు. సోమవారం రాత్రి 7 గంటల సమయం నుండి సిద్దార్ధ నేత్రావతి నది నుంి మిస్సయ్యారు. 

బెంగుళూరు: కేఫ్ కాఫీ డే అధినేత సిద్దార్ద మిస్సింగ్‌పై ఓ మత్స్యకారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నదిలో చేపలు పడుతున్న సమయంలో నేత్రావతి నదిలోని 8వ పిల్లర్ వద్ద బ్రిడ్జి పై నుండి ఓ వ్యక్తి నదిలోకి దూకడం చూసినట్టుగా తెలిపారు. 

సోమవారం  రాత్రి 7 గంటల సమయంలో నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద నుండి ఆయన అదృశ్యమయ్యారు.తాను చేపలు పడుతున్న సమయంలో ఎవరో నదిలోకి దూకినట్టుగా చూశానని అతను చెప్పారు. అయితే నదిలోకి దూకిన వ్యక్తి ఎవరో తాను గుర్తు పట్టలేనన్నారు. 

టీవీల్లో వ్యాపారవేత్త సిద్దార్ధ కన్పించకుండా పోయారనే వార్తను చూసినట్టుగా ఆ వ్యక్తి తెలిపారు. తాను చూసిన వ్యక్తి తప్పిపోయిన వ్యక్తి ఓక్కరే అని తాను కచ్చితంగా చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. 

నేత్రావది పై నిర్మించిన బ్రిడ్జిపై సిద్దార్ద కారు దిగి నడుచుకొంటూ వెళ్లినట్టుగా కారు డ్రైవర్ పోలీసులకు చెప్పారు.  అయితే డాగ్ స్క్వాడ్  బ్రిడ్జి మద్యకు వచ్చి ఆగిపోయింది. దీంతో బ్రిడ్జిపై నుండి  సిద్దార్ద దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

click me!