శృంగార తారగా ఒకప్పుడు షకీలాకు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా 90 వ దశకంలో షకీలాకు ప్రధాన పాత్రలో అనేక రొమాంటిక్ చిత్రాలు వచ్చాయి. షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోల సినిమాలకు కూడా గుబులే. అలా ఉండేది షకీలా హవా. ప్రస్తుతం షకీలాకు అవకాశాలు రావడం లేదు. 

షకీలా జీవితం సాఫీగా ఏమి సాగలేదు. మొదట హీరోయిన్ అవుదామని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల హీరోయిన్ కాలేక పోయింది. షకీలా ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. ప్రేమలో విఫలం కావడం, పెళ్లంటే ఇష్టం లేకపోవడంతోనే తాను వివాహానికి దూరంగా ఉన్నట్లు షకీలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

తన జీవితంలో ఏడుగురు వ్యక్తులతో ప్రేమలో పడ్డానని షకీలా తెలిపింది. వారందరిని మనస్ఫూర్తిగా ప్రేమించా. పెళ్లి చేసుకోలేని కూడా అనుకున్నా. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కండిషన్స్ పెట్టారు. మోసం చేసి వెళ్లిపోయారు. దీనితో తనకు ప్రేమ, పెళ్లిపై విరక్తి కలిగిందని షకీలా అంటోంది. 

తన తల్లిని అనాథాశ్రమంలో వదిలేస్తే పెళ్లి చేసుకుంటాం అని కండిషన్ పెట్టారు. మరికొందరు కుటుంబాన్ని విడచిపెట్టి వచ్చేయాలని కోరారు. తన ఫ్యామిలీని వదులుకోవడం తనకు ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదని షకీలా తెలిపింది.