మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శల వర్షం కురిపించారు.

లోకేష్ విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు.  2014లో 3,800కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని నాలుగేళ్లలో 8వేల కోట్లు దాటించారని.. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది మీ తండ్రే కదా అని ప్రశ్నించారు. ఇక బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవికీ అర్థం కాదంటూ సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చింది చంద్రబాబే కదా అని ప్రశ్నించారు. హరికృష్ణ పార్థివ దేహం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది చంద్రబాబేనని ఆరోపించారు.

‘‘మీ రాక్షస పాలనలో ఉద్యోగులుకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు గారూ? అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా? అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది.’’ అని ట్వీట్ చేశారు.

‘‘విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు ఏమిటయ్యా లోకేశ్? మీ నాయన నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 2014లో 3,800 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్నినాలుగేళ్లలో 8 వేల కోట్లు దాటించారు. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది మీ తండ్రే కదా?’ అని మరో ట్వీట్ చేశారు.

‘‘బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ణానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కాదు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిందీ తమరే. హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా చంద్రబాబు గారూ. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండి.’’ అంటూ లోకేష్ కి సెటైర్లు వేశారు.