తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మూడో సీజన్ మొదలైన సంగతి తెలిసిందే.. మొదటి వారం ఎలిమినేషన్ లో నటి హేమ బయటకి వచ్చేసింది. అలా బయటకి వచ్చేసిన ఆమె మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. తనకు ఎంతో మంది ఓట్లు వేశారని కానీ టెక్నికల్ ఇష్యూల కారణంగా అన్ని ఓట్లు తనకు పడలేదని.. ఆ కారణంగానే బయటకి వచ్చేసి ఉంటానని అన్నారు. 

మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓటింగ్ చేయాలని.. కొందరు పెద్ద వాళ్లకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలియక తనకు ఓట్లు పడలేదని చెప్పింది. బిగ్ బాస్ లో తను ఎలాంటి పొరపాట్లు చేయలేదని.. షోలో జరిగిన చాలా విషయాలను టెలికాస్ట్ చేయలేదని.. హౌస్ మేట్స్ తో వంట గది విషయంలో తను అరిచినవి మాత్రం ప్లే చేశారని చెప్పుకొచ్చింది. ఎవరైతే తనను మోసం చేశారో.. వారు ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారని పరోక్షంగా కామెంట్స్ చేసింది.

శ్రీముఖి బయటకి ఒకలా, లోపల మరోలా ప్రవర్తిస్తూ మానిప్యులేట్ చేస్తుందని. తనకంటే స్ట్రాంగ్ కంటెస్టంట్ ఎవరైనా ఉంటే బయటకి పంపించాలని చూస్తుంటుందని సంచలన కామెంట్స్ చేసింది. బాబా భాస్కర్ నేను ఎక్కువ మంచోడిని అని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని..  శ్రీముఖి, వితికాలు బాగా నటిస్తున్నారని.. బహుసా వారిలా నటించి ఉంటే హౌస్ లో తను ఇంకొంతకాలం ఉండేదాన్ని అంటూ తెలిపింది.

కానీ అలా నటిస్తే జనాలు చెప్పుతీసుకొని కొడతారని చెప్పింది. హౌస్ లో అంతా తనకంటే చిన్నవాళ్లని.. నేను వాళ్లను తిట్టలేను.. తిట్టించుకోలేను.. అంటూ చెప్పుకొచ్చింది. హౌస్ నుండి బయటకి వచ్చినందుకు ఎలాంటి బాధ లేదని చెప్పింది.