బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల ఓ హిందీ న్యూస్ పేపర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ క్రికెటర్ హార్దిక పాండ్యకి ఊర్వశికి మధ్య ఎఫైర్ నడిచినట్లు ఆ తరువాత బ్రేకప్ అయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి.

దీంతో ఓ హిందీ మీడియా హర్థిక్ పాండ్య.. ఊర్వశికి మాజీ ప్రియుడు అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. 'ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్థిక్ పాండ్య సాయం కోరారా..?' అని ఓ వార్త రాసింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఊర్వశి దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఫైర్ అయింది.  

ఇలాంటి వార్తలు ప్రచురించినందుకు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీడియా చానెళ్ళకు ఇలాంటి పిచ్చి వార్తలను ప్రచురించొద్దని వేడుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి వార్తల కారణంగా కుటుంబంలో కలహాలు వస్తాయని.. రేపు ఏదైనా జరిగితే నా కుటుంబానికి జవాబు చెప్పుకోలేను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో ఊర్వశి, పాండ్య కలిసి పలు పార్టీలకు కలిసి వెళ్లేవారు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడు వెల్లడించలేదు. ఇప్పుడు ఇద్దరూ విదిపోయారనే వార్తలు ఊపందుకున్నాయి.