వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని రక్తం పీల్చే జగన్ తో పోలుస్తూ విమర్శలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై లోకేష్ మండిపడ్డారు.  చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నవారందరికీ ట్విట్టర్ లో ఘాటుగా సమాధాలు ఇచ్చారు. 

‘‘ రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు’’ అంటూ సీఎం జగన్ ని జలగతో పోలిస్తూ... ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడం లేదన్నారు. తమపై విమర్శలు చేయడం మాని... పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.

ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తేనే వైసీపీ నేతల విమర్శలు వింటున్న ప్రజలకు రోత పుడుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసీపీ నేతల కడుపు మండిపోతుందన్నారు. అందుకే  పథకతం ప్రారంభించిన రెండో రోజే కేబుళ్లు కట్ చేశారని విమర్శించారు. 

అధికారంలో వాళ్లే ఉండి విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఫైబర్ గ్రిడ్ ని రాష్ట్రపతితోపాటు పలువరు ముఖ్యమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. అలాంటి ప్రాజెక్టుపై విమర్శలు చేయడం వైసీపీ కే చెల్లిందన్నారు. తమ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదని.. దమ్ముంటే నిరూపించండి అంటూ సవాలు విసిరారు.