కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన అదృశ్యమైనట్లు అందరూ భావించారు. కానీ... ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఆత్మహత్యకు ముందు తన కేఫ్ కాఫీ డే బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి  ఆయన ఓ లేఖ రాశారు.

ఆ లేఖ పూర్తి సారాంశం ఇదే...

‘‘37 సంవత్సరాలపాటు  బలమైన నిబద్ధతతో.. హార్డ్ వర్క్ చేశాను. దాని కారణంగానే మా కంపెనీలలో, దాని అనుబంధం సంస్థలలో  30వేల మందికి ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాను. ఈ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి దీనికి లార్జెస్ట్ స్టాక్ హోల్డర్ గా నేనే ఉన్నాను. అయితే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా... లాభాలు సాధించలేకపోతున్నాను. లాభదాయక వ్యాపారాన్ని సృష్టించడంలో విఫలమౌతున్నాను. చాలా కాలంగా దీని కోసం పోరాడుతూనే ఉన్నాను. ఇక నాకు పోరాడే ఓపిక లేదు. అందుకే అన్నీ వదిలేస్తున్నాను

 ప్రైవేట్ ఈక్విటీ పార్ట్ నర్స్ షేర్లను బై బ్యాక్ చేయమని నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడిని ఇక నేను తట్టుకోలేను. ఆదాయపన్ను మాజీ డీజీ నుంచి కూడా ఎన్నో వేధింపులకు ఎదుర్కొన్నాను. నాపై ఇప్పటి వరకు మీరు ఎంతో నమ్మకం ఉంచారు. దానిని నిలబెట్టుకోలేక పోయినందుకు క్షమించండి. 

కొత్త యాజమాన్యంతో మీరుంతా మళ్లీ వ్యాపారాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ తప్పులన్నింటికీ నాదే బాధ్యత. నా లావాదేవీల గురించి మా మేనేజ్ మెంట్ కీ, ఆడిటర్లకు తెలీదు. వాటిన్నింటికీ నేనే జవాబుదారిని. నేను ఎవరినీ మోసం చేయాలని అనుకోలేదు. మీరంతా ఈ విషయం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. 

ఇట్లు మీ వీజీ సిద్ధార్థ్’’ అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ