హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ అవగాహనపై హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో బైక్ నడుపుతూ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేస్తున్న వాహనదారులను అభినందించారు. దాదాపుగా 10ఏళ్లకు పైగా హైదరాబాద్ లో ఉంటూ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి ఫైన్ పడకుండా రోడ్ ను యూజ్ చేస్తున్న వాహనదారులకు ఫ్లవర్ ఇచ్చి అభినందనలు తెలిపారు. 

ఐడియల్ రోడ్ యూజర్ అంటూ వారిని కొనియాడారు. ఇప్పటి వరకు మీపై ఎలాంటి చలానాలు లేవని అందుకు మీరు అభినందనీయులు అంటూ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ పాటించేలా ఇతరులకు అవగాహన కల్పించాలని సీపీ అంజనీకుమార్ సూచించారు. 

ఈ సందర్భంగా ఐడియల్ రోడ్ యూజర్స్ కు సినిమా టికెట్లు కూడా అందజేశారు. కుటుంబంతో సినిమా చూడండి అంటూ వారి భుజం తట్టారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రమాదాలను అరికట్టాలని సీపీ అంజనీకుమార్ కోరారు.