రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రేణు దేశాయ్ పై మీడియా అంటెన్షన్ పెరిగింది. రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది. 

రేణు దేశాయ్, యాంకర్ ప్రేమ లైవ్ చాట్ లో ఉండగా ఓ అభిమాని బిగ్ బాస్ గురించి ప్రస్తావించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభానికి ముందు రేణు దేశాయ్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనవచ్చు కదా అని అభిమాని ప్రశ్నించగా.. బిగ్ బాస్ లో 24 గంటల పాటు కెమెరా ముందే ఉండాలి. నాకు అసలే మొహమాటం ఎక్కువ. అక్కడ ఉండలేను అని రేణు దేశాయ్ తెలిపింది. నేను బిగ్ బాస్ కు సరిపడే వ్యక్తిని కాదు అని రేణుదేశాయ్ తేల్చేసింది. 

అకీరా, ఆధ్యని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను.. అలాంటి 100 రోజులు ఎలా ఉండగలను అని రేణు దేశాయ్ తెలిపింది. నటిగా తన కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ ప్రస్తుతం రచయితగా, దర్శకురాలిగా రాణించేందుకు ప్రయత్నిస్తోంది. గత ఏడాది రేణు దేశాయ్ రెండవ వివాహం నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత తన రెండో వివాహం ఎప్పుడనే విషయాన్ని, ఆ వివరాలిని రేణు దేశాయ్ గోప్యంగా ఉంచింది.