ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన ప్రతీ చిత్రంలో ఉంటూ వస్తున్నారు రావు రమేష్. అలాగే అల్లు అర్జున్ సినిమాలోనూ ఆయన తప్పనిసరిగా ఉంటున్నారు. అదే రీతిలో తాజాగా త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలోనూ ఆయనకు వేషం పడింది. అయితే ఇప్పుడు ఆయన బయిటకు వచ్చేసారని సమాచారం. ఆయన ప్లేస్ లో నటడు, దర్శకుడు అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అందుకు కారణం ఏమిటనేది..ఏమన్నా వివాదమా లేక మరేదైనా అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎటువంటి వివాదమూ రావు రమేష్ కు ఆ చిత్రం టీమ్ కు మధ్య జరగలేదు. కేవలం డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకే తప్పుకున్నారట. ఈ సినిమా కోసం రెండు నెలలు డేట్స్ ఇచ్చారు. అయితే రకరకాల కారణాలతో సినిమా లేటవటంతో...డేట్స్ సమస్య వచ్చిందిట. కొద్ది రోజులు అంటే మ్యానేజ్ చేయచ్చు కానీ బల్క్ డేట్స్ అదీ కాంబినేషన్ లో అంటే కష్టం అని దర్శకుడుతో డిస్కస్ చేసి తప్పుకున్నారట. ఇప్పుడు ఆయన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కు వెళ్లిపోయారట. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నివేద పేతురాజ్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా… ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను పంద్రాగస్టున (ఆగస్టు 15) విడుదల చేయనున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి.