హైదరాబాద్: బీ.ఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 

వారం రోజుల క్రితం జరిగిన కిడ్నాప్ మిస్టరీకి తెరపడింది.  ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫారం 70 వద్ద  ఉన్నట్టుగా సోని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఎంజీబీఎస్‌ లో మౌనిక అనే యువతి  సోని గుర్తించింది. తన ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చింది.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మౌనిక మంగళవారం నాడు ఉదయం హైద్రాబాద్ కు చేరుకొంది. సోని నిల్చున్న  70 ఫ్లాట్ ఫారం వద్దే ఆమె కూడ నిలబడింది.టీవీలో వస్తున్న సోని ఫోటోను చూసిన మౌనిక ఆమెతో మాట్లాడి తన ఫోన్ ద్వారా సోని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం తెలుసుకొన్న పోలీసులు ఎంజీబీఎస్ కు వెళ్లి సోనిని రాచకొండ  సీపీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అద్దంకిలో తనను రవిశేఖర్ హైద్రాబాద్ బస్సు ఎక్కించినట్టుగా సోని పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు  రవిశేఖర్  అద్దంకి నుండి ఎక్కడెక్కడికి వెళ్తారనే విషయమై ఆరా తీసి గాలింపు చర్యలు చేపట్టారు. చెన్నై పారిపోయేందుకు రవిశేఖర్ ప్రయత్నిస్తుండగా ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒంగోలు నుండి రవిశేఖర్ ను పోలీసులు హైద్రాబాద్ కు తీసుకొస్తున్నారు. తిరుపతిలో ఉద్యోగం ఇప్పిస్తానని సోనిని నమ్మించి రవిశేఖర్ అక్కడికి తీసుకెళ్లినట్టుగా సోని మౌనికకకు చెప్పిందని సమాచారం.

అయితే వారం రోజులపాటు సోనిని రవిశేఖర్ ఎక్కడెక్కడికి తీసుకెళ్లాడనే విషయమై పోలీసులు సోనిని ప్రశ్నిస్తున్నారు. సోనిని ఆమె కుటుంబసభ్యుల సమక్షంలోనే పోలీసులు రవిశేఖర్ విషయమై ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అద్దంకిలో సోనిని విడిచిపెట్టిన కిడ్నాపర్

బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసు.. నిందితుడిని గుర్తించిన పోలీసులు