బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ఎంపీ సెగ్మెంట్‌‌ ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే  ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 18వ తేదీన మాండ్యా లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

మాండ్యా ఎంపీ స్థానం నుండి  కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి జెడీ(ఎస్) అభ్యర్ధిగా  పోటీ చేస్తున్నారు.ఇదే స్థానం నుండి  సినీ నటి, సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. సుమలతకు బీజేపీ మద్దతిస్తోంది.కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అనధికారికంగా ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు.  నిఖిల్ పాల్గొంటున్న ప్రచార సభల్లో పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌతున్నారు.  

తమది కుటుంబ పార్టీ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై నిఖిల్  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు ప్రత్యర్థులకు ఆయన ఘాటుగానే సమాధానమిస్తున్నారు.  పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిఖిల్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. 

గ్రామీణ ప్రాంత ప్రజలతో కలవడం తనకు .సంతోషంగా ఉందని నిఖిల్ చెబుతున్నారు. అంతేకాదు అదే సమయంలో  గ్రామీణ ప్రాంత ప్రజలు ఏం కోరుకొంటున్నారనే విషయమై తాను వారితో ముఖా ముఖి సందర్భంలో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నానని ఆయన వివరించారు.

నిఖిల్  నటించిన మూడో సినిమా త్వరలోనే విడుదల కానుంది. తనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ  ఉందని నిఖిల్ చెబుతున్నారు.ఇదిలా ఉంటే  నిఖిల్‌కు ప్రత్యర్ధిగా పోటీలో ఉన్న సినీ నటి సుమలత మాత్రం తన ప్రత్యర్ధి గురించి మాట్లాడబోనని చెబుతున్నారు. భవిష్యత్తులో తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించే చర్చించనున్నట్టు చెప్పారు.

గత 30 రోజుల నుండి ప్రచారం ఎలా సాగుతోందో మీరంతా గమనిస్తున్నారని  ఆయన చెప్పారు.  సుమలత ఎంత బలంగా ఉన్నారు. ఎక్కడ బలహీనంగా ఉన్నారనే విషయమై  ప్రస్తావిస్తున్నారని సుమలత చెబుతున్నారు.

కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే ప్రజలు తన పట్ల అత్యంత ప్రేమాభిమానాలు చూపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎవరి స్థాయిని కూడ తగ్గించదల్చుకోలేదని ఆయన చెప్పారు. తనకు సుమలత అంటే  చాలా గౌరవం ఉందన్నారు.  అంతేకాదు అంబరీష్ అంటే అన్న కూడ తన ప్రేమాభిమానాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

తాను యువత కోసం అనేక కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. జేడీ(ఎస్) ‌లో భాగస్వామి పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ సుమలతకు మద్దతు ఇస్తున్న విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్  పార్టీకి చెందిన కొందరు నేతలు తనకు దూరంగా ఉన్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను వెళ్లి మద్దతు అడిగినట్టుగా ఆయన చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తనకు మద్దతిస్తే మంచిదన్నారు. తనకు జేడీ(ఎస్) కార్యకర్తలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు,  ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. 

తాను ఈ స్థానం నుండి విజయం సాధిస్తానని ఆయన నమ్మకంగా చెప్పారు.  మాండ్యా  పార్లమెంట్ స్థానంలో రూ.8761 కోట్లతో అభివృద్ధి పనులను చేయించినట్టు  చెప్పారు.

మాండ్యా ఎంపీ స్థానంలో రూ. 500 కోట్ల కంటే ఎక్కువగా డబ్బులను ఖర్చు పెట్టలేదన్నారు. ఈ ఏడాది రూ.12వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామని ఆయన గుర్తు చేశారు.  15,58,000 రైతుల రుణాలు మాఫీ అయ్యాయని ఆయన గుర్తు చేసుకొన్నారు.

మాండ్యా జిల్లాలోని రైతుల నుండి రూ. 400 కోట్లు రుణాలను మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గంలో స్మార్ట్ స్కూళ్లను తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యువకులు క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న విషయాన్ని  ఆయన ప్రస్తావించారు. నెలకు రూ. 5 నుండి రూ. 10వేలకు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలు ఎవరూ కూడ తనను వీడిపోరన్నారు. తాను విజయం సాధిస్తానని ఆయన  చెప్పారు.

మాండ్యా ప్రజలు అంబరీష్‌పై ఉన్న ప్రేమాభిమానాలను ఇంకా తనపై చూపుతున్నారని సినీ నటి సుమలత అభిప్రాయపడ్డారు.ఒక్క పైసా ఆశించకుండా ప్రజలంతా తన ప్రచారానికి తరలివస్తున్నారని ఆమె చెప్పారు.అంతేకాదు ప్రజలు రూ. 20, రూ, 50లు తనకు ఎన్నికల విరాళంగా ఇస్తున్నారని ఆమె చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడ తనకు మద్దతు ఇస్తున్నారని  ఆమె గుర్తు చేశారు. మాండ్యా పార్లమెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందన్నారు. దీంతో పాటు ఇతర సమస్యలపై తాను పార్లమెంట్‌లో గళమెత్తనున్నట్టు ఆమె తెలిపారు.

మాండ్యా పరిధిలో  రూ. 50 కోట్ల రుణాలను మాఫీ అయ్యాయన్నారు. ఇంకా రూ.47వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సిన అవసరాన్ని సుమలత గుర్తు చేశారు.మాండ్యా ప్రజలకు కావేరి నీటి సమస్య తీవ్రమైందన్నారు. ఈ సమస్యను తాను పరిష్కరించనున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

స్ట్రాంగ్‌ రూమ్‌ నుండి ఈవీఎంల తరలింపు: కృష్ణా జిల్లాలో కలకలం

అనంత సీట్లన్నీ మావే:జేసీ దివాకర్ రెడ్డి

నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం

మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు

సీఎస్ సుబ్రమణ్యం కోవర్టు: చంద్రబాబు సంచలనం

సైలెంట్ వేవ్, జగన్‌కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా

ప్రచారానికి మూడు రోజుల సెలవు అందుకే: జగన్‌పై చంద్రబాబు

సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు

ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు

వైసీపీ అభ్యర్థి ప్రకాష్‌రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్

ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి