Asianet News TeluguAsianet News Telugu

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

మూడు ఓట్ల కోసం ఆరు గంటల పాటు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హైడ్రామా చోటు చేసుకొంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఈ గ్రామానికి చేరుకోవడంతో గురువారం అర్ధరాత్రి వరకు  పోలింగ్ స్టేషన్‌ నుండి ఈవీఎంలను తరలించలేదు.
 

six hours high drama for three votes in chandragiri assembly segment
Author
Amaravathi, First Published Apr 12, 2019, 10:54 AM IST

చంద్రగిరి: మూడు ఓట్ల కోసం ఆరు గంటల పాటు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హైడ్రామా చోటు చేసుకొంది. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఈ గ్రామానికి చేరుకోవడంతో గురువారం అర్ధరాత్రి వరకు  పోలింగ్ స్టేషన్‌ నుండి ఈవీఎంలను తరలించలేదు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలం రామానుజపల్లె,ఉప్పరపల్లె గ్రామాలున్నాయి. రామానుజపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నెంబర్  195 లో 1075 ఓట్లున్నాయి.

ఈ పోలింగ్ బూత్‌లో ఓటున్న ముగ్గురు ఓటర్లు ఓటింగ్ స్లిప్పులు తీసుకొన్నప్పటికీ సాయంత్రం ఆరు గంటల వరకు కూడ పోలింగ్ కేంద్రానికి చేరుకోలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటేసేందుకు ఈ ముగ్గురు పోలింగ్ బూత్ వద్దకు చేరుకొన్నారు.

అయితే అప్పటికీ ఎన్నికల సమయం ముగిసిపోయిందని  ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల అధికారులు అనుమతించలేదు.  అయితే ఈ విషయమై వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు.

ఈ ముగ్గురికి కూడ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని వైసీపీ నేతలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  ఈ విషయం తెలుసుకొన్న టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం  చేశారు.

ఇదే సమాచారం వైసీపీ, టీడీపీ అభ్యర్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  పులివర్తి నానిలకు  స్థానిక నేతలు చేరవేశారు.  దీంతో వీరిద్దరూ కూడ ఒకే సమయానికి గ్రామానికి చేరుకొన్నారు. ఈ ముగ్గురికి ఓటు వేసే హక్కును కల్పించాలని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. కానీ టీడీపీ అభ్యర్థి నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురు నేతలు కూడ అధికారులతో చర్చించారు.

ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకొన్న రిటర్నింగ్ అధికారి డాక్టర్ మహేష్ కుమార్, అర్బన్ ఎస్పీ అన్బురాజన్ గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అయితే సమయం ముగిసినందున  ఈ ముగ్గురికి  కూడ ఓటు వేసే అవకాశాన్ని ఇవ్వలేదు.  మూడు ఓట్ల కోసం ఆరు గంటల పాటు గొడవ జరగడంతో అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రామంలోనే ఈవీఎంలు అలానే ఉన్నాయి. అర్దరాత్రి 12 గంటల తర్వాత ఈవీఎంలను అధికారులు తరలించారు.

సంబంధిత వార్తలు

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి


 

Follow Us:
Download App:
  • android
  • ios