అమరావతి:అభివృద్ధి చెందిన  దేశాల్లో కూడ ఓటింగ్ కోసం ఈవీఎంలను ఉపయోగించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

గురువారం నాడు ఉండవల్లిలో కుటుంబసభ్యులతో ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అదే సమయంలో  ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లనే వాడాలని ఆయన కోరారు. 

బ్యాలెట్ పేపరు మీద ఓటు వేస్తే ఆ తృప్తి ఈవీఎంలలో ఉండదని ఆయన చెప్పారు. వీవీప్యాట్లను కనీసం 50 శాతం లెక్కించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే  కేవలం ఐదు శాతం ఈవీఎంల వీవీప్యాట్లను మాత్రమే లెక్కించాలని నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఈ విషయమై రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తామన్నారు.

ఏపీలో చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదనే వార్తలు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పరిణామం చివరగా తప్పుడు పనులు చేసే వారికి ఉపయోగపడే అవకాశం ఉందని బాబు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.