హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం నాడు పోలింగ్ ప్రారంభమైన  తర్వాత చాలా చోట్ల  ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు అసహానం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రంలో చాలా చోట్ల పోలింగ్ ప్రారంభం కాలేదు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని నాలుగు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. ఇదే జిల్లాలోని ఈపురులోని 89వ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి.

కురువాండ్లపల్లి,శేషాపురం, కె. మరువపల్లి ప్రాంతాల్లో కూడ పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు పనిచేయని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉండవల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.  అయితే ఇదే పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.

తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలం రావెళ్లవారిపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.  పెరుమాళ్లపల్లి పంచాయితీ పరిధిలోని 167వ పోలింగ్‌బూత్‌లో ఈవీఎంలు పని చేయలేదు.

కృష్ణా జిల్లాలోని కంచికచర్లలోని  పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదని అధికారులకు సమాచారం అందింది. కడప జిల్లాలోని జమ్మలమడుగులో కూడ ఈవీఎంలు పనిచేయలేదు.

అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని గార్లదిన్నెలో ఈవీఎంలు మొరాయించాయి. ఇదే జిల్లాలోని మడకశిరలో కూడ ఈవీఎంలు పనిచేయని కారణంగా పోలింగ్ ఆలస్యమైంది.

పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో కూడ ఈవీఎంలు పని చేయలేదు.ఇదే జిల్లాలోని గుత్తిలో, పుట్టపర్తిలోని కోట్లపల్లిలోని బూత్ నెంబర్ 117 బూత్ నెంబర్ లో ఈవీఎంలు పనిచేయలేదు.

రొద్దం మండలం మరువపల్లిలో కూడ ఈవీఎంలు పనిచేయడం లేదని అధికారులకు సమాచారం చేరింది.విశాఖ ఏజెన్సీలో, గుంటూరు జిల్లాలోని పలు చోట్ల కూడ ఈవీఎంలు పనిచేయడం లేదని  ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పటాన్ చెరువులో ఈవీఎంలు మొరాయించినట్టుగా అధికారులకు సమాచారం అందింది. మరో వైపు మంచిర్యాల జిల్లాలో  కూడ ఇదే పరిస్థితి నెలకొందని  సమాచారం అందింది.

సంబంధిత వార్తలు

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.