గుంటూరు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉప్పలపాడులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

అరవింద్ బాబు వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఏలూరులో వైసీపీ కార్యకర్తపై సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటీ బుజ్జి దాడికి దిగాడని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే బుజ్జి తనపై దాడి చేశారని వైసీపీ కార్యకర్త ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని పొన్నతోటలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.ఈ ప్రాంతానికి పారా మిలటరీ బలగాలను తరలించారు. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. 

గజపతినగరంలో కూడ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది.కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోట్లదుర్తి పోలింగ్‌ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రం దగ్గర తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్‌ను వైసీపీ ఏజెంట్‌ అడ్డుకున్నాడు.

 దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తంగెడుమల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి గరటయ్య పార్టీ కండువాతో వచ్చారు. దీంతో ఎన్నికల అధికారులు అభ్యంతరం తెలిపారు.

సంబంధిత వార్లలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.