ఆళ్లగడ్డ: కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో  పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు. గురువారం నాడు చోటు చేసుకొన్న ఘర్షణల్లో మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో గురువారం ఉదయం గొడవలు చోటు చేసుకొన్నాయి. అహోబిలంలోని 89,90 పోలింగ్ కేంద్రం వద్ద రెండు పార్టీలకు మధ్య గొడవలు  చోటు చేసుకొన్నాయి.

అహోబిలం వద్ద గొడవలో మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్,  అఖిలప్రియ సోదరి నాగ మౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఒకవైపు ఉంటే, మరో వైపు వైసీపీ అభ్యర్ధి గంగుల నాని అలియాస్ బ్రిజేంద్రనాథ్ రెడ్డి మరో వైపు నిలబడ్డారు. ఈ రెండు కుటుంబాలు ఎదురుపడి గొడవకు దిగాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నాయి.

మరో వైపు ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలోని 143 పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్‌ నిలిపివేయాలని వైసీపీ అభ్యర్ధి నాని డిమాండ్ చేస్తే పోలింగ్ కొనసాగించాలని భూమా అఖిలప్రియ పట్టుబట్టారు. ఈ సమయంలో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నాయి.  ఈ ఘటనలో ఓ ఆర్టీసీ బస్సు కూడ ధ్వంసమైంది.

ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ఒకానొక దశలో టియర్‌గ్యాస్‌ను కూడ ప్రయోగించారు. 15 ఏళ్ల క్రితం చోటు చేసుకొన్న ఫ్యాక్షన్ గొడవలు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి ఫ్యాక్షన్  తగాదాలు  ఉన్నాయి.

తమ అనుచరులు రవి, శివలను వైసీపీ అభ్యర్ధి నాని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ ఆళ్ళగడ్డలో భూమా నాగ మౌనిక రెడ్డి, జగత్ విఖ్యాత్ రెడ్డిలు రోడ్డుపైనే ధర్నాకు దిగారు. నిన్న చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి