పులివెందుల: ఏపీ ప్రజలు ఈ దఫా మార్పును కోరుకొంటున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. జాతీయ మీడియా ఛానెల్స్ నిర్వహించిన సర్వేల్లో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారని ఆయన గుర్తు చేశారు.

గురువారం నాడు కడప జిల్లా పులివెందులలో వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.ఈ దఫా ప్రజలు రాష్ట్రంలో మార్పును కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఓటు హక్కును వినియోగించుకొనే సమయంలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో సిస్టమ్ మార్పు కావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దఫా ప్రజలు స్పష్టమైన తీర్పును ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.