అమరావతి: ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందిందని ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

గురువారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కామెంట్స్‌పై తాను స్పందించననని చెప్పారు.అలా స్పందించాల్సిన అవసరం కూడ తనకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలోని 92 వేల ఈవీఎంలలో 382 ఈవీఎంలలో సమస్యలు వచ్చినట్టు ఆయన చెప్పారు.

గుంటూరు జిల్లాలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనట్టుగా ఆయన చెప్పారు. పోలింగ్ సమయాన్ని పెంచే అవకాశం లేదన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు.

అయితే ఆయా పోలింగ్ కేంద్రాల నుండి ప్రిసైడింగ్ అధికారి నుండి జిల్లా కలెక్టరేట్ల నుండి సమాచారం వస్తే రీ పోలింగ్ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తామన్నారు.

తాడిపత్రి నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య జరిగిన గొడవలో ఒక్కరు మృతి చెందారని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 20 చోట్ల ఈ రెండు పార్టీల మధ్య  ఘర్షణలు జరిగాయని ఆయన తెలిపారు.

ఒక్క పార్టీకి ఓటు వేస్తే మరో పార్టీకి ఓటు పడినట్టుగా ఎవరైనా చెబితే మీరు చూశారా... ఈ విషయాన్ని రుజువు చేస్తారా అని నిలదీయాలని గోపాలకృష్ణ ద్వివేది ప్రశ్నించారు. ఒకవేళ ఇదే జరిగితే తాను ఆ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పరిశీలిస్తానని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.