Asianet News TeluguAsianet News Telugu

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

 చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
 

tdp workers attacked on putalapattu ysrcp candidate ms babu
Author
Amaravathi, First Published Apr 11, 2019, 4:03 PM IST

ఈ నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. కట్టకిందపల్లెలో టీడీపీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే విషయం తెలుసుకొన్న వైసీపీ అభ్యర్ధి ఎంఎస్ బాబు ఆ గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఈ గ్రామంలో రిగ్గింగ్ జరుగుతోందని ప్రచారం సాగడంతో అక్కడికి చేరుకొన్న బాబు ఈవీఎంను ధ్వంసం చేశారు. బాబు అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకొన్నారు. అసహనంతో బాబు ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఎంఎస్ బాబుతో పాటు ఆయన తనయుడిపై దాడికి దిగారు. బాబు వాహనాన్ని కూడ ద్వంసం చేశారు.

ఎంఎస్ బాబును చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను చిత్తూరు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను చిత్రీకరించిన మీడియా ప్రతినిధులపై కూడ టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. 

విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యంగా  వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని  వైసీపీ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios