Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారి పోలింగ్ బూత్‌లోనే  సెల్పీ దిగారు.

eletion officer selfi with megastar chiranjeevi in polling station in hyderabad
Author
Hyderabad, First Published Apr 11, 2019, 9:50 AM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారి పోలింగ్ బూత్‌లోనే  సెల్పీ దిగారు.

గురువారం నాడు జూబ్లీహిల్స్‌లోని 49 పోలింగ్ స్టేషన్‌ పరిధిలో చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ తనయుుడ రామ్‌చరణ్ తేజ రామ్ చరణ్ సతీమణి ఉపాసనలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

వీరంతా ఒకేసారి ఓటు వేసేందుకు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకొన్నారు. చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత  ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారి చిరంజీవితో సెల్పీ తీసుకొన్నారు. పోలింగ్ బూత్‌ల్లో విధుల్లో ఉన్న ఎన్నికల అధికారి తన సెల్‌ఫోన్‌లో చిరంజీవితో కలిసి సెల్పీ దిగారు.

నిబంధనలకు విరుద్దంగా  పోలింగ్ బూత్‌లోనే సెల్పీ దిగిన అధికారిపై ఎన్నికల అధికారులు ఏం చర్యలు తీసుకొంటారనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios