గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంతకల్లు అసెంబ్లీ స్థానంలోని గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఏర్పాట్లు సరిగా లేవని జనసేన  అభ్యర్థి మధుసూదన్ గుప్తా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పోలింగ్ బూత్‌లో ఏర్పాటు చేసిన బోర్డులో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల జాబితాలో తన ఫోటోను లేకుండా ఏర్పాటు చేయడంపై మధుసూదన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై మధుసూదన్ గుప్తా అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు.అక్కడే ఉన్న ఈవీఎంను నేలకేసికొట్టారు. దీంతో మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉంటే తాను ఈవీఎంను ధ్వంసం చేయలేదన్నారు. అధికారులతో గొడవ పెట్టుకొనే సమయంలో తన కాలు తాకి ఈవీఎం ధ్వంసమైందని ఆయన పోలీసులకు చెప్పారు.

సంబంధిత వార్తలు

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.