అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు గురువారం నాడు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని ఉండవల్లి ఏర్పాటు చేసిన   పోలింగ్ కేంద్రంలో చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, ఆయన భార్య బ్రహ్మిణి ఓటు హక్కును  వినియోగించుకొన్నారు.ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లే సమయంలో ఓ వృద్ధురాలితో బాబు మాట్లాడారు. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకొన్నారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు కోరారు. ఓటును వినియోగించుకొని తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని బాబు కోరారు.రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలైనందున ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.