హైదరాబాద్: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు షాక్ తగిలింది. టీజేఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నగేష్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో నగేష్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నగేష్ తోపాటు పలువురు టీజేఎస్ కార్యకర్తలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వైఖరిపై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణను అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ, తెలంగాణ ప్రజలను వేధించిన పార్టీ కాంగ్రెస్ లతో పొత్తా అంటూ విమర్శించారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు జీతాలు రాకుండా చేసి ఉద్యోగులను రోడ్డు పాల్జేసిన కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటారా అంటూ నిలదీశారు. 

తెలంగాణ ఉద్యోగులను రాచిరంపాన పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీలు చేసిన అరాచకాలు గుర్తుకు రావడం లేదా అంటూ ప్రశ్నించారు. ఓయూలో విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. 

తెలంగాణ కోసం పోరాటం చేసిన విద్యార్థులపై కేసులు పెట్టి జైలుకు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకుంటారా అంటూ మండిపడ్డారు. జైల్లో మగ్గుతున్న విద్యార్థులను, అక్రమ కేసుల నుంచి బయటకు తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వకీలను పెట్టి వారిని బయటకు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. 

ఉద్యమకారులకు అండగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేదు, ఉద్యమకారులను తెలంగాణ సమాజాన్ని ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ పార్టీ ముద్దా అంటూ ధ్వజమెత్తారు. ఆనాడు ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు జేఏసీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన పార్టీ కాంగ్రెస్ కాదా అంటూ మండిపడ్డారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పై పీడీ యాక్టు పెట్టి వరంగల్ జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. 

తెలంగాణ కోసం ఓయూలో పోరాటాలు చేసిన పిడమర్తి రవి, బాల్క సుమన్, అజయ్, యర్రోళ్ల శ్రీనివాస్ వంటి విద్యార్థి నేతలకు పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగాలను సైతం పక్కనపెట్టి పనిచేసిన స్వామిగౌడ్ ను శాసనమండలి చైర్మన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని, అలాగే శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యే చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. 

వైద్యుల జేఏసీ పోరాటం చేసిన బూర నర్సయ్యగౌడ్ ను లోక్ సభకు పంపిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు. అటు ఉద్యమంలో పాల్గొన్న ఓయూ ప్రొఫెసర్లలో సీతారాం నాయక్ ను పార్లమెంట్ కు పంపిన ఘనత టీఆర్ఎస్ పార్టీ కే చెల్లుతుందన్నారు. 

తెలంగాణ ఉద్యమకారుల పట్ల, ఉద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించి వారికి అన్ని సముచిత స్థానం కల్పించిన టీఆర్ఎస్ పార్టీ నిరంకుశంగా కనిపిస్తుందా అంటూ కోదండరామ్ ను నిలదీశారు. విద్యార్థులకు కనీసం మూడు టిక్కెట్లు కూడా కేటాయించని కాంగ్రెస్ మీకు ముద్దా అంటూ మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఓడిపోయే సీట్లు మాత్రమే టీజేఎస్ కు ఇస్తుందని హరీష్ స్పష్టం చేశారు. ఓడిన సీట్లుు ఇస్తూ పోటీ చేస్తే చెయ్ అంటూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తో పొత్తా అంటూ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో టీజేఏసీ చైర్మన్ గా ఎంతో గౌరవించామని కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయిందన్నారు.  

టీడీపీతో పొత్తును టీజేఏస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు హరీష్. ఒకప్పుడు వలసవాద పార్టీ అంటూ టీడీపీ,వైసీపీలను విమర్శించిన కోదండరామ్ ఇప్పుడు ఆపార్టీతో ఎందుకు పొత్తుపెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ప్రకటించిన తర్వాత కోదండరామ్ హైదరాబాద్ లో మాయమై ఢిల్లీలో తేలారని ఆనాడే కాంగ్రెస్ తో చీకటి రాజకీయాలు చేశారన్నారు. ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి తనకు కావాల్సిన ఐదుగురికి టిక్కెట్లు ఇప్పించుకున్నారని తెలిపారు. నేడు నేరుగా కాంగ్రెస్ తోనే పొత్తుపెట్టుకుంటున్నారన్నారు. 

కోదండరామ్ నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియజెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం మహాకూటమి ఏర్పాటును సహించడం లేదన్నారు. అందులో భాగంగానే టీజేఎస్ ప్రధాన కార్యదర్శి నగేష్ ఆపార్టీకి రాజీనామా చేశారని ఆయన బాటలో మరింత మంది వస్తారన్నారు. 

మహాకూటమి చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని అమరావతి నుంచి చంద్రబాబు స్కెచ్ వేస్తున్నట్లు హరీష్ ఆరోపించారు. తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయాలను తాను ప్రజలకు సాక్షాధారాలతో సహా చూపిస్తుండటంతో ఖంగుతిన్న చంద్రబాబు కోదండరామ్ ను కూటమిలో అగ్రస్థానం ఇస్తున్నట్లు డైరెక్షన్ ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఆలోచనలో భాగంగానే కోదండరామ్ కు చట్టబద్దత కమిటీ కన్వీనర్ అంటూ ఉత్తమ్ ప్రకటిస్తున్నారని తెలిపారు. 

టీజేఎస్ ప్రధాన కార్యదర్శి పదవికి నగేష్ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు హరీష్. నగేష్ రాజీనామాతో సంగారెడ్డిలో టీజేఎస్ ఖాళీ అయ్యిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ బీజేపీ ఖాళీ అయ్యిందన్నారు. ఇక సంగారెడ్డిలో దారులన్నీ కారు వైపేనన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని హంత్రి హరీష్ ధీమా వ్యక్తం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీట్ల లొల్లి: టీడీపీ పోటీచేసే సీట్లివే, నాలుగు సీట్లపై కుదరని ఏకాభిప్రాయం

కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు: రాహుల్‌గాంధీ అసహనం

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

ప్రచారం చెయ్యాల్సిన సమయం, సాగదీత వద్దు:కోదండరామ్

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు