జూ.ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభం రోజుల్లో చాలా బరువుతో ఇబ్బందిగా ఉండేవారు. అయితే ఆయనకు డాన్స్ లో ఉన్న ఈజ్, డైలాగ్ డెలివరీలో ఉన్న పట్టు ఎక్కడా డ్రాప్ అవకుండా లాక్కొచ్చాయి. ఇప్పటికీ ఎన్టీఆర్ పాత ఫొటోలు, సినిమాలు చూసిన వారు..ఆ ఎన్టీఆర్..ఇప్పుడు మనం చూస్తున్న ఎన్టీఆర్ ఒకరేనా అని ఆశ్చర్యపోతూంటారు. అంతలా బరువు తగ్గి ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా యమదొంగ సమయానికి ఆయన వంద కేజీలు బరువుకు చేరుకున్నారని చెప్తారు. అప్పుడు రాజమౌళి సలహాతో దాదాపు ఇరవై కేజీలు బరువు తగ్గి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే రాజమౌళి సలహాతో బరువు పెంచటం మొదలెట్టి వంద కేజీలకు చేరుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి దర్శకత్వంలో  ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (ప్రస్తుతానికి వర్కింగ్‌ టైటిల్‌) కోసం బరువు పెరుగుతున్నారు. రామ్‌చరణ్‌ మరో  హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో  ఎన్టీఆర్ వంద కిలోలకు పైగా బరువుతో, భారీకాయంతో కనిపించబోతున్నారు. ఈ బరువుకి  గుబురు గడ్డం తోడుగా ఉండబోతోంది! 

సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రయినర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో గత  కొన్ని నెలలుగా ఈ బాడీ, లుక్‌ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెరపై తన ఆకారంతో ఆశ్చర్యపరచబోతున్నారు. అదే సమంయోల ఈ సినిమాలో రామ్‌చరణ్‌ లుక్‌ కోసం ప్రముఖ ముంబై హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిం హకీంను రాజమౌళి రప్పించి రచ్చ చేయబోతున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్  చేస్తున్నారు. నవంబర్‌ 19న మొదలైన షెడ్యూల్‌  మధ్యలో రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్నా కంటిన్యూ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆల్ లపై యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో నాలుగైదు రోజులు పాటు ఈ షెడ్యూల్‌ ఉంటుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త.

ఇవి కూడా చదవండి..

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?