MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?

నాగార్జున, కృష్ణ అభిమానుల మధ్య అతి పెద్ద వార్... ఎప్పుడు జరిగిందో తెలసా? కారణం ఏంటి ?

కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది. కానీ.. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా గొడవలు జరిగాయని మీకు తెలుసా? దానికి కారణం ఏంటి? ఎందుకలా జరిగింది.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 10 2026, 06:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు..
Image Credit : Asianet News

స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు..

స్టార్ హీరోల అభిమానుల మధ్య యుద్దాలు కామన్. పెద్ద పెద్ద హీరోల అభిమానులు కొట్టుకోవడం, రచ్చ చేయడం గతంలో బాగా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా వార్ బాగా పెరిగిపోయింది. యాంటీ టీమ్స్ తయారయ్యి.. హీరోలను ట్రోల్ చేయడం ఎక్కువయ్యింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

తమ హీరోనే గొప్ప అని నిరూపించేందుకు కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శించుకుంటూ వాదనలు సాగిస్తుంటారు. , గతంలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండేది. అప్పట్లో అభిమానుల మధ్య విభేదాలు నేరుగా థియేటర్ల దగ్గర జరిగేవి. అక్కడే మాట మాట పెరిగి కొట్టుకున్న సందర్బాలు కూడా చాలా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కృష్ణ - నాగార్జున అభిమానుల మధ్య గొడవలు..
Image Credit : facebook.com/ghattamanenisuperstar

కృష్ణ - నాగార్జున అభిమానుల మధ్య గొడవలు..

సాధారణంగా స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఎన్టీఆర్ - కృష్ణ, చిరంజీవి - బాలయ్య, బాలయ్య - నాగార్జు, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ , అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల అభిమానుల మధ్య వార్స్ జరుగుతుండేవి. ముఖ్యంగామెగా నందమూరి అభిమానుల యుద్థాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ విచిత్రంగా సూపర్ స్టార్ కృష్ణ - కింగ్ నాగార్జున అభిమానులు మధ్య కూడా ఓ పెద్ద గొడవ జరిగిందన్న విషయం మీకు తెలుసా? . ఆ వార్ ఎప్పుడో కాదు.. ఇద్దరు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వారసుడు’ టైమ్ లోజరిగింది.

Related Articles

Related image1
నాగార్జున టెన్షన్ నుంచి బయటపడటానికి ఏం చేస్తాడో తెలుసా? అందుకే కింగ్ అంత కూల్ గా ఉంటాడా?
Related image2
కృష్ణ ను ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మార్చిన మూవీ, ఒకేసారి 20 అవకాశాలు తెచ్చిపెట్టిన సినిమా, గూడఛారి 116 రివ్యూ..
36
వారసుడు సినిమాలో తండ్రీ కొడుకులుగా స్టార్ హీరోలు..
Image Credit : Sri Jayabheri Art Productions

వారసుడు సినిమాలో తండ్రీ కొడుకులుగా స్టార్ హీరోలు..

ఈ సినిమాలో నాగార్జున - కృష్ణ కలిసి నటించారు. హిందీలో భారీ విజయాన్ని సాధించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. మురళీమోహన్ నిర్మించిన ఈసినిమాను .. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాలో కృష్ణ చేసిన పాత్రను మురళీమోహన్ చేయాలని భావించారు. అయితే వరుస ఫ్లాప్‌ల సెంటిమెంట్ కారణంగా ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. 

తర్వాత కృష్ణను సంప్రదించగా మొదట ఆయన ఈ సినిమాలో తండ్రి పాత్ర చేయడానికి అంగీకరించలేదు. ఇతర నటులను ప్రయత్నించినా సరైన ఎంపిక దొరకకపోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి, కృష్ణ పాత్రకు మరింత ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఎలివేషన్లు జోడించారు. దాంతో ఆయన ఈ రిక్వెస్ట్ ను ఒప్పుకున్నారు.

46
అభిమానులు మధ్య చిచ్చు పెట్టిన సినిమా..
Image Credit : Sri Jayabheri Art Productions

అభిమానులు మధ్య చిచ్చు పెట్టిన సినిమా..

ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ప్రత్యేకంగా జరిగింది. నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షుడితో క్లాప్ కొట్టించి షూటింగ్ ను స్టార్ట్ చేశారు. దాదాపు 90 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. మొత్తంగా రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. అప్పటి పరిస్థితులను బట్టి భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది.

1993 మే 5న ‘వారసుడు’ సినిమా విడుదలైంది. విడుదలైన వెంటనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ అదే సమయంలో అభిమానుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇద్దరు ప్రముఖ హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో థియేటర్ల వద్ద బ్యానర్లు, కటౌట్లు పెట్టే విషయంలో అభిమానుల మధ్య పోటీలు జరిగాయి.

56
కృష్ణ అభిమానులు ఎందుకు గొడవ చేశారు?
Image Credit : Youtube/ETV

కృష్ణ అభిమానులు ఎందుకు గొడవ చేశారు?

కొన్ని సన్నివేశాలు కూడా వివాదానికి కారణమయ్యాయి. సినిమాలో కృష్ణ పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉందని, నాగార్జున కృష్ణను “వాడు, వీడు” అంటూ సంభోదించే సన్నివేశాలు ఉండడం, కాలర్ పట్టుకునే సీన్ ఉండడం కృష్ణ అభిమానులకు నచ్చలేదు. దీంతో ఆ సన్నివేశాలను తొలగించాలని, అలాగే కృష్ణపై ఒక పాట, ఒక ఫైట్ సీన్ జోడించాలని ఘట్టమనేని అభిమానులు డిమాండ్ చేశారు. డిమాండ్లు చేయడమే కాదు.. థియేటర్ల దగ్గర అభిమానులు ఆందోళనలు చేశారు. కొన్ని చోట్ల నాగార్జున కటౌట్లను తగలబెట్టడం, మరికొన్ని చోట్ల థియేటర్లలో బాక్సులను పగలగొట్టడం లాంటివి కూడా చేశారు.

66
బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన సినిమా..
Image Credit : Sri Jayabheri Art Productions

బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసిన సినిమా..

ఇలా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కృష్ణ, నాగార్జున తో పాటు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కలిసి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి వివరణ ఇచ్చారు. కృష్ణ అభిమానులను సంతోషపెట్టేలా.. వివాదాన్ని పరిష్కరించేందుకు సినిమాలో కొన్ని సన్నివేశాలను తొలగించారు. అదనంగా కృష్ణతో ఒక ఫైట్ సీన్ చిత్రీకరించి క్లైమాక్స్‌లో చేర్చారు. 

ఆ తర్వాత అభిమానుల ఆగ్రహం తగ్గింది. ఇన్ని వివాదాల మధ్య కూడా ‘వారసుడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సుమారు రెండున్నర కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 100 రోజులు ఆడింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
కృష్ణ ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
నాగార్జున టెన్షన్ నుంచి బయటపడటానికి ఏం చేస్తాడో తెలుసా? అందుకే కింగ్ అంత కూల్ గా ఉంటాడా?
Recommended image2
కృష్ణ ను ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మార్చిన మూవీ, ఒకేసారి 20 అవకాశాలు తెచ్చిపెట్టిన సినిమా, గూడఛారి 116 రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved