నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పలు గెటప్స్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

తాజాగా 'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్ లుక్ లో బాలయ్యని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం. అచ్చం తన తండ్రిలానే ఆ గెటప్ లో దర్శనమిచ్చాడు బాలయ్య. దివంగత ఎన్టీఆర్ కెరీర్ లో 'వేటగాడు' సినిమా కీలకపాత్ర పోషించింది.

అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఆ  కారణంగానే ఈ బయోపిక్ లో వేటగాడు గెటప్ ని చూపించబోతున్నారు.ఇప్పటికే రకుల్, బాలయ్య కాంబినేషన్ లో ఆకుచాటు పిందె తడిసే పాటని చిత్రీకరించారు.

అలానే సినిమాలో 'వేటగాడు'కి సంబంధించి మరికొన్ని సీన్లు కూడా చిత్రీకరించబోతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

సంబంధిత వార్త.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ