ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంత సీన్ లేదు కొందరు కొట్టిపారేస్తున్నారు. మరికొందరైతే అబ్బే..మీరు కంగారుపడకండా అలా చూస్తూండండి...  అఫీషియల్ గా త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు . 

వాస్తవానికి ఇప్పటిదాకా వదిలిన ఫొటోలు,పోస్టర్స్ తో ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది . జాతీయ స్దాయిలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునే స్దాయికి వచ్చింది. ఈ నేపధ్యంలో  ఈ క్రేజ్ కు ఊపుకి జూనియర్ ఎన్టీఆర్ కూడా తోడైతే సునామీ స్దాయిలో క్రేజ్ క్రియేట్ అవుతుంది . అయితే అదే దెబ్బ కొడుతుంది. ప్రాజెక్టుపై అనవసరమైన అంచనాలు ఏర్పడతాయి అని టీమ్ భావిస్తోందిట. దాంతో ఎన్టీఆర్ ని ఎంతవరకూ ఉపయోగించుకోవాలో అంతవరకే ఈ బయోపిక్ కు వాడాలని ఫిక్స్ అయ్యారట. 

దాంతో ఎన్టీఆర్ తో ఈ సినిమాకు ప్రారంభంలో వాయిస్ ఓవర్ చెప్పిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తోందిట టీమ్. అలాగయితే ఎన్టీఆర్ ఉన్నట్లు ఉంటుంది..కానీ తెరపై కనపడరు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నటుడు తెరపైకి రావాలంటే అందుకు తగ్గ ప్రతిష్టాత్మకమైన పాత్ర ఉండాలి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా అలాంటి పాత్రలు ఏముండే అవకాసం ఉంటుంది. అందుకే వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ ని సీన్ లోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. అదీ విషయం .

 క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ...జనవరి 9 , జనవరి 24 న రెండు భాగాలుగా కథానాయకుడు , మహానాయకుడు గా విడుదల చేయనున్నారు . అంటే జనవరిలో రికార్డుల మోత మోగడం ఖాయం  అని నందమూరి అభిమానులు ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ

నందమూరి కలయిక..వాళ్లకు మింగుడుపడటం లేదా..?

హీరోయిన్ పై బాలయ్య కవిత.. సోషల్ మీడియాలో విమర్శలు!

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?