హృదయాలను తాకేలా ఎమోషనల్ గా కథను చూపించడంలో దర్శకుడు క్రిష్ ప్రతిసారి శబాష్ అనిపించుకున్నాడు. కథ ఏదైనా మంచి సందేశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 

 

అయితే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఎలక్షన్ సమయానికి ప్రేక్షకుల ముందు ఉంచాలనేది బాలయ్య టార్గెట్. కానీ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసమే సమయాన్ని ఎక్కువగా వాడేశారు. మొదట తేజ తప్పుకోగానే ఏప్రిల్ లో క్రిష్ చిత్ర యూనిట్ తో కలిశాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకు సంబందించిన షూటింగ్ విషయంలో కథానాయకుడు బాలకృష్ణ సందేహాగానే ఉన్నారట. 

రెండు పార్టులుగా తీయగలిగే ఎన్టీఆర్ సినిమా ఈ ఏడాది చివరికల్లా ఎండ్ అవుతుందా అని ముందు నుంచి చర్చలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను రిలీజ్ చెయ్యాలని ముందే అనుకున్నారు. ఇకపోతే క్రిష్ కి ఇచ్చిన ఆరు నెలల సమయంలోనే ఎన్టీఆర్ షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడట. రెండు పార్ట్ లు అంటే 4 నుంచి 5 గంటల వరకు నిడివి ఉంటుంది. షూటింగ్ ముగిసిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాలి. 

పైగా బయోపిక్ ఆ కాలం నాటి సినిమా. అన్ని ఆలోచిస్తే రెండేళ్ల సమయంలో తీసే సినిమాను క్రిష్ యమ స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నాడు. క్రిష్ గత సినిమాలు చాలా వేగంగా తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. గౌతమి పుత్ర లాంటి హిస్టారికల్ సినిమాను 79 రోజుల్లో ఫినిష్  చేసి  దర్శకులను ఆశ్చర్యపరిచాడు. ఇక పిరియడ్ ఫిల్మ్ కంచెను కేవలం ఆరు నెలల్లో ఫినిష్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. .