MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..

Giri Babu: ఆ స్టార్ హీరోతో రూమ్ షేరింగ్.. మధ్యలోనే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్నా..

Giri Babu: ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు తన కెరీర్‌ తొలినాళ్లలోని కష్టాలను, నటుడు మోహన్ బాబుతో పంచుకున్న రూమ్ మేట్ జ్ఞాపకాలను ఈ ఇంటర్వ్యూలో వివరించారు. సినిమాలపై విరక్తితో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్న క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 19 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోహన్ బాబుతో రూమ్ షేరింగ్ నుండి స్టార్‌డమ్ వరకు..
Image Credit : Giri Babu\Instagram

మోహన్ బాబుతో రూమ్ షేరింగ్ నుండి స్టార్‌డమ్ వరకు..

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గిరిబాబు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను, మద్రాసులో తన రూమ్ మేట్‌గా ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోహన్ బాబుతో రూమ్ మేట్‌గా
Image Credit : facebook.com/TheMohanBabu

మోహన్ బాబుతో రూమ్ మేట్‌గా

1969 ప్రాంతంలో మద్రాసులో గిరిబాబు, మోహన్ బాబు ఒకే రూమ్‌లో ఉండేవారు. అప్పట్లో ఆ రూమ్ అద్దె కేవలం 40 రూపాయలు కాగా, ఇద్దరూ చెరో 20 రూపాయలు పంచుకునేవారు. మోహన్ బాబు అప్పట్లో ఒక పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తూనే, నటుడు కావాలనే బలమైన కోరికతో ఉండేవారు. రూమ్‌లో ఉన్న సమయంలో మోహన్ బాబు డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటే, గిరిబాబు ఆయనను ప్రోత్సహించేవారు. "నువ్వు బాడీ పెంచు, నీ డైలాగ్ డెలివరీ బాగుంది, ఖచ్చితంగా పెద్ద నటుడివి అవుతావు" అని గిరిబాబు అప్పట్లోనే మోహన్ బాబుతో అనేవారట.

35
సినిమాలపై విరక్తి - కఠినమైన రోజులు
Image Credit : Giri Babu\Instagram

సినిమాలపై విరక్తి - కఠినమైన రోజులు

కెరీర్ ఆరంభంలో వరుసగా రెండు సినిమాలు ఆగిపోవడంతో గిరిబాబు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, ఒక్కోసారి భోజనం కూడా లేక కేవలం మంచినీళ్లు తాగి రెండు రోజులు గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ కష్టాల వల్ల విరక్తి చెంది, ఇండస్ట్రీ మనకు అచ్చిరాదనుకుని తన ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కనీసం రేడియోలో సినిమా పాటలు వినిపించినా తట్టుకోలేక ఆపేయమని చెప్పేవారట. అంతలా ఆయన సినిమాలకు దూరం కావాలని అనుకున్నారు.

45
ఆల్ రౌండర్‌గా గుర్తింపు
Image Credit : Giri Babu\Instagram

ఆల్ రౌండర్‌గా గుర్తింపు

తిరిగి వచ్చిన తర్వాత 'జగమే మాయ' వంటి సినిమాలతో గిరిబాబు బిజీ అయ్యారు. ఆయన కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. ఒక థియేటర్లో హీరోగా కనిపిస్తే, పక్క థియేటర్లో విలన్‌గా కనిపించేవారు. హీరో, విలన్, కామెడీ, తండ్రి పాత్రలు.. ఇలా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. పాత్ర నిడివి కంటే ఆ పాత్ర ఇచ్చే ఇంపాక్ట్ ముఖ్యం అని ఆయన నమ్మేవారు.

55
నేటి సినిమాలపై స్పందన
Image Credit : Giri Babu\Instagram

నేటి సినిమాలపై స్పందన

ప్రస్తుత కాలంలో ఎవరైనా సినిమా తీయడం సులభం అయిపోయిందని, కానీ ఆ రోజుల్లో సినిమా తీయాలంటే ఎంతో అనుభవం, కథాబలం ఉండాలని గిరిబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వారానికి 8-9 సినిమాలు వస్తున్నాయని, కానీ అందులో ఎన్ని గుర్తుంటున్నాయనేది ప్రశ్నార్థకమని ఆయన అన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Recommended image2
Giri Babu: నమ్మించి మోసం చేశారు.! చిరంజీవి 'కొదమ సింహం' మూవీ వల్ల రూ. 20 లక్షలు నష్టపోయా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved