దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది.

ఈరోజు ఉదయం ఎన్టీఆర్ 'కథానాయకుడు' పేరుతో పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా రెండో భాగానికి 'మహానాయకుడు' అనే టైటిల్ ని పెట్టి బాలకృష్ణ మరో పోస్టర్ ని విడుదల చేశారు.

''అతను కథగా మారితే, 'కథానాయకుడు'.. అతనే ఓ చరిత్రయితే, 'మహానాయకుడు'...'' అంటూ చిత్రబృందం ట్వీట్ చేస్తూ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హంసలదీవి సమీపంలో నిర్వహిస్తున్నారు. బాలకృష్ణతో పాటు కీలక పాత్రధారులంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!