'ఎన్టీఆర్' బయోపిక్ రెండు భాగాలుగా రాబోతుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అది నిజమేనని తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా చూపించాలని దర్శకుడు క్రిష్ నిర్ణయించుకున్నాడు. అలా అని మొదటి భాగం, రెండో భాగం విడుదలలో పెద్దగా గ్యాప్ ఇవ్వడం లేదు. వారం గ్యాప్ లో రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ముందుగా పార్ట్ 1 'కథానాయకుడు' జనవరి 9న  ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తరువాత జనవరి 16న రెండో భాగం విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన ముందుగా లేదు. కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయంలో దాదాపు 164 సన్నివేశాల వరకు వచ్చాయట.

ఒక సినిమాకి 60 నుండి 70 సన్నివేశాలు సరిపోతాయి కనుక ఈ సినిమాను రెండు భాగాలుగా మార్చాలని నిర్ణయించుకున్నారట. ఎన్టీఆర్ యవ్వన దశ ఆయన హీరోగా ఎదిగిన తీరుని 'కథానాయకుడు'లో చూపించి, ఆయన రాజకీయ ప్రయాణం, అంతిమయాత్రని రెండో భాగంలో చూపించబోతున్నారు.

మొత్తానికి క్రిష్ ఈ ప్రాజెక్ట్ లోకి దిగి సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఎంతో వేగంగా సినిమాను పూర్తి చేస్తూ అనుకున్న సమయానికి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు రూ.80 కోట్ల బడ్జెట్ తో చేయాలనుకున్న సినిమా కాస్త ఇప్పుడు రూ.150 కోట్లకు చేరిందని సమాచారం.  

సంబంధిత వార్త.. 

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!