స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా నిర్మితమౌతున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’.గత కొంతకాలంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ ఒక్కోక్కటి విడుదల అవుతూ అభిమానుల్లో ఉత్కంఠత రేపుతున్నాయి.  అయితే పోస్టర్స్ పై మొదటనుంచీ వేస్తూ వచ్చిన "కథానాయకుడు" పదం మాత్రం మిస్సైంది. రీసెంట్ గా విడుదల చేసిన రాజర్షి పాట ప్రమోషన్ పోస్టర్ పైనా, రానా పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన చంద్రబాబు పోస్టర్ పైనా కథనాయకుడు అనేది ఉండకపోవటం గమనించవచ్చు.

కేవలం ‘యన్‌.టి.ఆర్‌’ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకలా చేస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కథానాయకుడు అనేది కావాలనే తీసి ప్రమోట్ చేస్తున్నారని,   ‘యన్‌.టి.ఆర్‌’అనే బ్రాండ్ నేమ్ తో ముందుకు వెళ్లటం మంచిదని, పార్ట్ 1,పార్ట్ 2 గా పబ్లిసిటీ చేయటమే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. 

ఇకచిత్రం విషయానికి వస్తే...ఆ మధ్యన విడుదల చేసిన ‘కథానాయకా..’  పాట అందరిని ఆకట్టుకుంది. అలానే రీసెంట్గా  ‘రాజర్షి...’ అనే మరొక పాటను చిత్ర యూనిట్ విడుదల చేస్తే అదీ సక్సెస్ అయ్యింది. ఆ పాటలో...‘తల్లి ఏదీ? తండ్రి ఏడీ?అడ్డుతగిలే బంధమేది?..అంటూ ప్రశ్నించే పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ హీరో. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

ఈ చిత్రంలో చాలామంది  హీరోలు,హీరోయిన్స్ నటిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో రకుల్, అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్, హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌లు నటిస్తున్నారు. వారాహి, ఎన్‌బికె, విబ్రి మీడియా సంస్థలు కలిసి రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. 2019 జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!