హైదరాబాద్: టీజేఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల గుర్తుపై పోటీ చేయాలని   ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనను టీజేఎస్ చీఫ్ కోదండరామ్  తిరస్కరించారు.  కాంగ్రెస్ పార్టీ గుర్తుపై టీజేఎస్ అభ్యర్థులు పోటీ చేస్తే  రాజకీయంగా టీజేఎస్  అస్థిత్వమే దెబ్బతినే అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది.అంతేకాదు రాజకీయంగా ,సాంకేతికంగా కూడ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ ప్రతిపాదనను  టీజేఎస్ తిరస్కరించింది. 

డిసెంబర్ 7వ తేదీన  తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు టీడీపీ, టీజేఎస్,  కాంగ్రెస్, సీపీఐ  ప్రజా కూటమి( మహాకూటమి)గా ఏర్పడ్డాయి. ప్రజా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు  చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సోమవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నవంబర్ రెండో తేదీన టీజేఎస్ చీఫ్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ ‌గాంధీ కీలకమైన ప్రతిపాదన ఒకటి చేశారు. 

 టీజేఎస్‌ నుండి పోటీ చేసే అభ్యర్థులంతా కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల గుర్తుపై పోటీ చేయాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్గించనుంది. టీజేఎస్‌ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం భావించింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌కు   టీజేఎస్ చీఫ్  కోదండరామ్‌ తేల్చి చెప్పారు.

టీజేఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపై విజయం సాధిస్తే సాంకేతికంగా వారంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అసెంబ్లీలో గుర్తింపు పొందుతారు. వాస్తవానికి విజయం సాధించిన టీజేఎస్ అభ్యర్థులు  తమ స్వంత బలంపై విజయం సాధించినా ..... ఆ విజయం కాంగ్రెస్ ఖాతాలోకి చేరుతోంది. ఇది రాజకీయంగా టీజేఎస్‌కు నష్టం.

మరో వైపు ఉద్యమ సంస్థ రూపం నుండి రాజకీయ పార్టీగా ఏర్పాటైన ఉద్దేశ్యమే... అసెంబ్లీలో టీజేఎస్ అడుగుపెట్టాలనే లక్ష్యం.  ఈ తరుణంలో మరో పార్టీ ఎన్నికల గుర్తుపై పోటీ చేసి విజయం సాధిస్తే రాజకీయంగా నష్టమేననేది టీజేఎస్ నేతల అభిప్రాయం.

తమ బలం కూడ ఏమిటో తెలుసుకొనేందుకు వీలుగా టీజేఎస్‌ తమ ఎన్నికల గుర్తుపై  పోటీ చేయాలని ఉత్సుకతతో ఉంది.  ప్రస్తుతం కూటమిగా నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి ఎజెండా ఆధారంగా ఈ నాలుగు పార్టీలు పోటీకి దిగుతున్నాయి.

ఉమ్మడి ఎజెండాను కూడ ఖరారు చేశాయి.ఈ ఎజెండాను  అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భవిష్యత్తులో  ఈ భాగస్వామ్య పార్టీల మధ్య  విబేధాలు ఏర్పడితే  కాంగ్రెస్ పార్టీ నుండి టీజేఎస్  అభ్యర్థులు పోటీ చేస్తే  రాజకీయంగా   నష్టమని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం కంటే తమ స్వంత ఎన్నికల గుర్తుపై  పోటీ చేయడమే ఉత్తమమని ఆ పార్టీ భావిస్తోంది.ఇదే విషయాన్ని కోదండరామ్ రాహుల్ కు వివరించారు. 

టీజేఎస్ తమ ఎన్నికల గుర్తుగా అగ్గిపెట్టెను ఎంపిక చేసుకొంది.ఈ మేరకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు.   ఎన్నికల సంఘం అఫ్రూవల్ రాగానే టీజేఎస్  తన ఎన్నికల గుర్తును  అధికారికంగా ప్రకటించనుంది.

సంబంధిత వార్తలు

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?