Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దెబ్బ

కేసీఆర్ ఎన్టీ రామారావు అభిమాని. ఆ కారణంగానే తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఎన్టీఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ బాలయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర పట్ల కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం. 

Telangana Assembly elections blow to Balayya
Author
Hyderabad, First Published Jan 5, 2019, 12:23 PM IST

హైదరాబాద్: ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాపై తెలంగాణ శాసనసభ ఎన్నికల దెబ్బ పడినట్లే కనిపిస్తోంది.  బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో అనుమతి ఇచ్చింది. బాలకృష్ణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసి బెనిఫిట్ షోలకు అనుమతి కోరారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా పన్ను మినహాయింపు సౌకర్యం కూడా కల్పించారు. దానిపై తెలంగాణవాదుల నుంచి కేసీఆర్ విమర్శలు కూడా ఎదుర్కున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు బాలకృష్ణకు తెలంగాణ పెద్దలతో సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత హైదరాబాదులోని బసవతారకం మెమోరియల్ ట్రస్టు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. తెలంగాణ పెద్దలతో బాలయ్యకు ఉన్న సన్నిహిత సంబంధాలు తెలంగాణ శాసనసభ ఎన్నికలతో దెబ్బ తిన్నాయి. 

అభిమానులను అదుపు చేయలేకపోవడం, అనవసమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం వంటి సమస్యల కారణంగా బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నప్పటికీ కథానాయకుడు సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం వెనక రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

నిజానికి,  కేసీఆర్ ఎన్టీ రామారావు అభిమాని. ఆ కారణంగానే తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఎన్టీఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ బాలయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర పట్ల కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం. 

ఇదే సమయంలో రామ్ చరణ్ తేజ నటించిన వినయ విధేయ రామ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తుందో వేచి చూడాల్సిందేనని అంటున్నారు. చెర్రీ తెలంగాణ అల్లుడు కావడం, కేటీఆర్ కు సన్నిహిత మిత్రుడు కావడం ఆ సినిమాకు లాభించే అవకాశాలున్నట్లు అంచనాలు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బ్రేకింగ్: ఎన్టీఆర్ ‘కథానాయకుడు’కు స్పెషల్ షో లు లేవు

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios