నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది. ఈ ఈవెంట్ కి చిత్రబృందంతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన రానా మాట్లాడుతూ.. ''భల్లాలదేవుడి రోల్ తరువాత చంద్రబాబునాయుడు పాత్ర వేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. 'కృష్ణంవందే జగద్గురుం' కోసం క్రిష్ తో కలిసి పని చేశాను. ఆ క్రియేటివ్ జర్నీ.. ఎన్టీఆర్ బయోపిక్ తో పూర్తయింది. బాలకృష్ణ గారి 'కథానాయకుడు' సినిమా డిసంబర్ 14న నేను కూడా పుట్టాను.

నా జీవితంలో నేను మొట్టమొదటిసారి చూసిన షూటింగ్ బాలకృష్ణ గారు నటించిన 'రాము'. ఎందుకంటే ఆయన మా ఇంట్లో షూటింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి నా పాత్ర నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆయనే మొదటి ఆడియన్.. నేను మూడో క్లాస్ లో ఉన్నప్పుడు 'మేజర్ చంద్రకాంత్' సినిమా చూశాను. ఆ వయసులో నాకు రామారావు గారి గురించి తెలియదు. 

కానీ మా తాతగారిని ఆయన దగ్గరకి తీసుకెళ్లండని అడిగేవాడ్ని.. ఆయన  తీసుకెళ్లలేదు. రామారావు గారు కాలం చేశారు. కానీ ఈరోజు మా తాతగారికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే .. ఆయన కథానాయకుడిగా ఎన్టీఆర్గారిని ఎలా చూశారో.. ఆయన పక్కనుండి మహానాయకుడిలా నేను చూశాను ఆయన్ని.. ఈ సినిమాలో నటించడం నేను గౌరవంగా భావిస్తున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.

బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు.రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా  'కథానాయకుడు' రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు'కథని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?