Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ పెంచేసిందనే చెప్పాలి. 

ntr biopic trailer talk
Author
Hyderabad, First Published Dec 21, 2018, 7:15 PM IST

నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ పెంచేసిందనే చెప్పాలి. . ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్లడం దగ్గర నుండి రాజకీయాల్లోకి వెళ్లే వరకు అన్ని అంశాలను ప్రస్తావించే విధంగా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ లో బసవతారకం,  ఎన్టీఆర్ ల మధ్య వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పలికిన డైలాగులు అభిమానులను కట్టి పడేస్తున్నాయి. మచ్చుకు కొన్ని.. 

''జనం కోసమే సినిమా అనుకున్నాను.. ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను..''

''60 ఏళ్లు వస్తున్నాయి.. ఇన్నాళ్లు మాకోసం బతికాం ఇక ప్రజల కోసం ప్రజాసేవలో బతకాలనుకుంటున్నాం''

''నన్ను దేవుడిని చేసిన మనుషుల కోసం నేను మళ్లీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను''

''ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది. కానీ ఇది జనబలం ఒక్క పిలుపులో వినిపిస్తుంది''

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. ముందుగా 'కథానాయకుడు' చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథ ఫిబ్రవరి 7న  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

Follow Us:
Download App:
  • android
  • ios