టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ అట్టహాసంగా మొదలైంది. జెఆర్సీ కన్వెన్షన్ లో నందమూరి వృక్షం మొత్తం హాజరైంది. హాల్ లో అభిమానుల కంటే నందమూరి కుటుంబ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. బాలకృష్ణ ఈ వేడుకకి దాదాపు అందరిని ఇన్వైట్ చేశారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన నటులు కూడా వేడుకకు హాజరయ్యారు. 

మోహన్ బాబు కృష్ణం రాజు సూపర్ స్టార్ కృష్ణ వేదికపై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముందుగా కృష్ణ జ్యోతి ప్రజ్వలనతో ఈవెంట్ ను ప్రారంభించారు. బారి బందోబస్తు మధ్య వేడుకను నిర్వహిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తొదరగానే వేడుకకు హాజరయ్యారు. తారకరత్న కళ్యాణ్ రామ్ తో పాటు రామారావు కి సంబందించిన మనవళ్ళు మనవరాళ్లు అందరూ ఆడియో లాంచ్ లో కలుసుకోవడంతో చాలా కాలం తరువాత నందమూరి వృక్షం వికసించినట్లు అనిపించింది.