దివంగత నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు. ముందుగా 'కథానాయకుడు' చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది. అయితే ఈ వేడుకకు బాలయ్య.. జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానిస్తాడా..? లేదా..? అనే సందేహాలు వినిపించాయి.

కానీ బాలయ్య స్వయంగా తారక్ కి ఫోన్ చేసిన వేడుకకి రమ్మని ఆహ్వానించారట. ఇప్పటికే నందమూరి కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు ఈ వేడుకకి హాజరు రాగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకు వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. 

చాలా గంభీరంగా ఆడిటోరియంలోకి వచ్చిన తారక్ తన బాబాయ్ బాలకృష్ణని చూడగానే నవ్వేశాడు. బాలయ్య.. తారక్ దగ్గరకి వచ్చి అతడిని పలకరించగా అందరి దృష్టి వారిపైనే పడింది. మరి బాబాయ్ నటించిన తన తాతయ్య సినిమా గురించి ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.