నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది.  ఈ సందర్భంగా సినిమాలో రేలంగి పాత్ర పోషించి ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ''సీనియర్ ఎన్టీఆర్ గారితో నటించే ఛాన్స్ వస్తుందా..? రాదా..? అని అనుకుంటున్న సమయంలో నాకు 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

కానీ షూటింగ్ లో ఆయన దగ్గరకి వెళ్ళగానే డైలాగ్స్ మర్చిపోయేవాడ్ని. అప్పుడు ఆయన మీరు బాగా చేస్తున్నారు చేయండని ప్రోత్సహించేవారు. ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు.. ప్రతివాడికి ఓ జీవితం ఉండాలి.. దానికొక చరిత్ర ఉండాలి. అటువంటి జీవిత చరిత్ర కలిగిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్. ఆయన నటనని పుణికిపుచ్చుకున్నాడు బాలకృష్ణ గారు.

ఆయనతో కలిసి 'నర్తనశాల' సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు బాలకృష్ణ గారిని చూస్తుంటే ఎన్టీఆర్ గారిని చూసిన భావన కలిగేది. ఎన్టీఆర్ గారి పాత్రలన్నీ బాలకృష్ణ గారి శరీరం మీద ఆహార్యం రూపంలో ధరించిన అదృష్టం బాలకృష్ణ గారికే దక్కింది. ప్రతిరోజు సెట్ లో తన తండ్రిని తలుచుకుంటూనే ఉంటారు బాలకృష్ణ గారు. ఆయనతో కలిసి నటించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను'' అని వెల్లడించారు. 

బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు.రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా 'కథానాయకుడు' రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్