శుక్రవారం ఉదయం మూడు సినిమాల సందడి మొదలైతే సాయంత్రానికి నందమూరి అభిమానుల అసలైన హంగామా మొదలు కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ అండ్ ట్రైలర్ లాంచ్  రేపు హైదరాబాద్ లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు వచ్చే అతిథులపై గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తున్నాయి. 

ఎవరు వస్తారు ఎవరు రారు అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటున్న సమయంలో ఒక లిస్ట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా సినిమా మొట్ట మొదటి వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నట్లు తెలుస్తోంది. తారక్ వేడుకలో పాల్గొనలేడని ఆహ్వానం కూడా అందదు అని టాక్ వచ్చినప్పటికీ రేపటితో వాటికి కౌంటర్ పడనుంది. 

ఇక నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఈవెంట్ కి రానున్నారని సమాచారం. ఇక సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ - రెబల్ స్టార్ కృష్ణం రాజు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే అలనాటి నటీమణులు జమున, గీతాంజలి వేడుకలో ప్రత్యేక అతిధులుగా విచ్చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు జూబ్లీ హిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో వేడుక మొదలుకానుంది.