నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు మాట్లాడుతూ.. ''అటువంటి మహానటుడు మంచికి మారుపేరైన వ్యక్తి గురించి ఈ జెనరేషన్ వారు విని ఉంటారు కానీ చూసి ఉండరు. ఆయనకి 
నేను పెద్ద అభిమానిని.

అలాంటిది ఆ మహానటుడితో కలిసి నటించే అవకాశం వచ్చింది. 1982లో శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టినప్పుడు 'బొబ్బిలిపులి' గెటప్ లో ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టారు.  ఆ తరువాత 1993 అదే బ్యానర్ లో అన్నయ్య(సీనియర్ ఎన్టీఆర్)చివరి సినిమా 'మేజర్ చంద్రకాంత్' తీశాను. ఆ సినిమాలో మహానటుడు ఇచ్చిన పెర్ఫార్మన్స్ తరతరాలకు గుర్తుండిపోతుంది.

ఆయనతో నాకున్న అనుబంధం గురించి చెప్పలేను. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. ఇద్దరం అన్నదమ్ముల్లా ఉన్నాం. 'మేజర్ చంద్రకాంత్' షూటింగ్ పూర్తయిన తరువాత అన్నయ్య, నేను కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లాం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఉండడంతో ఎన్టీఆర్ డౌన్ డౌన్ అన్నాడు.. నేనొక్కడినే ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని అన్నాను. నీకు అంత ధైర్యం ఏంటి అని అడిగారు.. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాన్ని గడ్డిపరకలా చూస్తాడని అప్పుడు అన్నయ్యతో అన్నాను.

1994 లో అన్నయ్యని మొట్టమొదటి సారిగా షిరిడి సాయినాథుడి దగ్గరకి తీసుకువెళ్లింది నేను. ఏం కోరుకున్నావని అడిగగా.. మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు  చెప్పాను. మళ్లీ 1995 లో ఆయనను షిరిడి తీసుకెళ్ళాను. లంచం అనే పదానికి అర్ధం తెలియని వ్యక్తి. నందమూరి కుటుంబానికే లంచం అనే పదం తెలియదు.. బాలయ్యని అన్నయ్య రూపంలో చూస్తుంటే నాకు రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. క్రిష్ అద్బుతంగా ఈ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తోంది'' అంటూ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?