ఎన్టీఆర్ ఆడియో వేడుకలో రామారావు గారితో సన్నిహితంగా ఉన్న అందరూ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్ తో చివరి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ 12 సార్లు తప్పకుండా చూస్తాను అని అభిమానులకు ప్రామిస్ చేశారు. 

ఎందుకంటే తాను రామారావు గారితో 12 సినిమాలు చేశాను అంటూ.. ఏడాదిలో ఉండే 12 నెలలు కౌంట్ చేసుకొని ప్రతి నెలలో ఎన్టీఆర్ బయోపిక్ చూస్తాను అని గట్టిగా చెప్పేశారు. ఇక ఈ కథానాయకుడు - మహానాయకుడు బయోపిక్ చరిత్రలో నిలిచిపోతుందని ఎవరికీ తెలియని ఒక బావోద్వేగమైన విషయాన్నీ చెప్పారు. అదే విధంగా బాలయ్యను ఒక కోరిక కోరారు. 

రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. 

'ఈ స్టేజ్ మీద ఇలా ఉండటానికి కారణం ఎన్టీఆర్ గారు. నేను కట్టుకున్న ఇల్లు ఓపెనింగ్ కు అన్నగారు వదినమ్మ కలిసి ఫొటోలో కనిపించిన విధంగా వచ్చేవారు. అప్పుడు బట్టలతో పాటు రెమ్యునరేషన్ కూడా ఇచ్చారు. ఆ జ్ఞాపకాలను మర్చిపోలేను అంటూ బాలకృష్ణను ఒక కోరిక కోరారు. 

ఎన్టీఆర్ దంపతులు ఉంటె వాళ్ళ కళ్ళకి నమస్కరించేవాన్ని కానీ ఇప్పుడు సినిమాలో కనిపించిన మీరు చిన్నవారు కాబట్టి ఆ పని చేయలేను. అందుకే ఒక ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నా అని విద్యా బాలన్ తో అలాగే బాలకృష్ణతో కలిసి రాఘవేంద్ర రావు ఫోటో దిగారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో రాఘవేంద్ర రావు గారి పాత్రని ఆయన తనయుడు ప్రకాష్ కోవెలమూడి పోషించారు. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?