నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో తెరకెక్కిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది. ఈ వేడుకకు నందమూరి కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో అట్టహాసంగా వేడుకను నిర్వహించారు.

ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''బాబాయ్ ని చూస్తుంటే పెద్దాయన గుర్తొస్తున్నారు. ఆ మహానటుడి కుటుంబంలో నేనొక సభ్యుడ్ని అని చెప్పుకోవడం గర్వకారణం. చిన్నప్పుడు తెలిసీ తెలియని వయసులో ఆ మహానటుడిని తాతయ్య అని పిలిచేవాడ్ని.. కానీ ఆయన గురించి తెలిసిన తరువాత రామారావు గారు అనో, అన్నగారు అనో సంబోధించడం  మొదలుపెట్టాను.

ఎందుకంటే ఆయన ఏ ఒక్క కుటుంబానికి చెందిన వారు కాదూ.. ప్రతీ తెలుగింటికి చెందిన వ్యక్తి. ఆయన చరిత్ర గురించి మనకి తెలియాల్సింది చాలా మిగిలివుంది. తెలుగు వాళ్లు అని కూడా మనల్ని సంభోదించని రోజుల్లో ఇదిరా తెలుగువాడి ఖ్యాతి అని గర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తుల్లో నందమూరి తారకరామారావు ఓ ప్రముఖుడు. మా తాత గురించి మీ తాత చేసిన చిత్రమని గర్వంగా నా పిల్లలకు చూపించుకుంటాను.

ఆ మహానుభావుడి చరిత్ర మా తరువాతి తరానికి కూడా తీసుకెళ్తున్నారు. ఆ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది. బాబాయ్ నటించిన సినిమాలు నేను ఎన్నో చూశాను.. కానీ మొదటిసారి ఆయనలో మా తాతగారిని చూసుకున్నాను. ఈ సినిమా విజయం సాధించిన తరువాతే మొదలైంది. చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవు. చరిత్ర సృష్టించడమే ఉంటుంది. బాబాయ్ కన్న కలకి చేదోడు వాదోడుగా నిలిచాడు క్రిష్. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు'' అంటూ వెల్లడించారు. 

బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశారు.రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా 'కథానాయకుడు' రూపంలో జనవరి 9న విడుదల చేస్తుండగా, 'మహానాయకుడు' కథని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్