Asianet News TeluguAsianet News Telugu

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

సినిమా రిజల్ట్ కంటే ముందే పెట్టిన బడ్జెట్ లో లాభాలు రావాలంటే మెయిన్ గా ప్రమోషన్స్ క్లిక్ అవ్వాలి. సినిమాపై అంచనాలు ఏ మాత్రం పెరిగినా ప్రీ రిలీజ్ భారీ స్థాయిలో ఉంటుంది. అదే తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ స్థాయిని పెంచిన బాలకృష్ణ ఇప్పుడు జేబులు నింపుకొని సంక్రాంతికి ముందే పండగ చేసుకుంటున్నాడు. 

BALAKRISHNA PRIFITS BEFORE NTR RELEASE
Author
Hyderabad, First Published Dec 25, 2018, 6:07 PM IST

సినిమా రిజల్ట్ కంటే ముందే పెట్టిన బడ్జెట్ లో లాభాలు రావాలంటే మెయిన్ గా ప్రమోషన్స్ క్లిక్ అవ్వాలి. సినిమాపై అంచనాలు ఏ మాత్రం పెరిగినా ప్రీ రిలీజ్ భారీ స్థాయిలో ఉంటుంది. అదే తరహాలో ఎన్టీఆర్ బయోపిక్ స్థాయిని పెంచిన బాలకృష్ణ ఇప్పుడు జేబులు నింపుకొని సంక్రాంతికి ముందే పండగ చేసుకుంటున్నాడు. 

ఎందుకంటే సినిమా కు సంబందించిన మొత్తం డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది. కథానాయకుడు - మహానాయకుడు గా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాలను తెలుగు హిందీ తమిళ్ భాషలకు గాను 25 కోట్లకు అమెజాన్ ప్రైమ్ బిజినెస్ క్లోజ్ చేసిందని సమాచారం. ఈ ఎమౌంట్ చాలా పెద్ద లాభం అని చెప్పవచ్చు. ఇక శాటిలైట్ పరంగా సినిమా మరింత గట్టి ఎమౌంట్ ను అందుకోనుంది. 

మొత్తంగా రిలీజ్ కు ముందే శాటిలైట్ - డిజిటల్ స్ట్రీమింగ్ పరంగా ఈ బయోపిక్ 45 కోట్ల వరకు లాభాన్ని అందుకోనుంది. సినిమాను బాలకృష్ణ సొంతంగా NBK ప్రొడక్షన్ లో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సాయి కొర్రపాటి - విష్ణు ఇందుకూరి కూడా సహా నిర్మాతలుగా ఉన్నారు. భారీ తారాగణంతో పాటు సెట్స్ ను కూడా గ్రాండ్ నిర్మించడంతో బడ్జెట్ 60 కోట్లు దాటిందని టాక్ వస్తోంది. 

ఆ లెక్కన చూసుకుంటే దాదాపు 75% లాభాలు ముందే వచ్చాయి. ఇక నెక్స్ట్ ఎలాగూ రిలీజ్ కు మంచి ఓపెనింగ్స్ అందుతాయి కాబట్టి నిర్మాతలు సేఫ్. ఇక బయ్యర్స్ సినిమాపై ఆశలు పెట్టుకోవాలి. ఇప్పటికే కొన్ని ఏరియాల నుంచి అడ్వాన్స్ కూడా అందినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios