లెజండరీ నటుడు దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ ని ముందుగా తేజ డైరెక్ట్ చేయాలనుకొని ఫైనల్ గా క్రిష్ చేతుల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో ఈ ప్రాజెక్ట్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరకి వెళ్లిందట.

కానీ ఆ సమయంలో ఆయన ఆసక్తి చూపలేదట. ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావుకి మంచి అనుబంధం ఉంది. అయినప్పటికీ ఆయన ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేయాలనుకోలేదు. అయితే ఈ బయోపిక్ లో 'ఒక్క షాట్ కైనా దర్శకత్వం చేస్తా' అని సినిమా ఓపెనింగ్ రోజున చెప్పారు రాఘవేంద్రరావు. అంత పెద్ద డైరెక్టర్ నోరు తెరిచి అడిగారంటే క్రిష్ కచ్చితంగా అతడు కోరికని నెరవేర్చాలి.

కానీ దర్శకేంద్రుడి కోరికను లెక్క చేయనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకి చేరుకుంది. మరో రెండు, మూడు రోజుల్లో గుమ్మడికాయ కూడా కొట్టేస్తారు. కానీ ఇంతవరకు రాఘవేంద్రరావు కోరిక తీరలేదట. ఇక తీరుతుందనే నమ్మకం కూడా లేదు.

ఎందుకంటే మిగిలింది ప్యాచ్ వర్క్ కాబట్టి. ఎటొచ్చీ రాఘవేంద్రరావుని సంతృప్తి పరిచే విషయం ఏమిటంటే.. సినిమాలో రాఘవేంద్రరావు పాత్రలో ఆయన తనయుడు ప్రకాష్ నటించాడు. ఆ విధంగా ఈ సినిమాలో తన పాత్రకు స్థానం దక్కింది!

సంబంధిత వార్తలు.. 

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!