నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకలో నందమూరి కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యి అభిమానులకు కనువిందు చేశారు. ఈ సంధర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''చాలా త్వరగా సినిమా పూర్తయి ట్రైలర్ లాంచ్ జరుగుతుందంటే నమ్మశక్యంగా లేదు.

పైగా రెండు భాగాలు.. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఈరోజు ఆయన వారసుడిగా మీ ముందుకు రావడం నా పూర్వజన్మసుకృతం. నేనొక సినిమాలో చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మేమే అని డైలాగ్ చెప్పాను. ఈరోజు చెప్తున్నా.. మేము చరిత్ర సృష్టించడానికే ఉన్నాం.. రిపీట్ చేయడానికి కాదు. ఆధునిక ఆంధ్ర సృష్టికర్త నందమూరి తారకరామారావు. 

నాన్నగారి పాత్రని చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ముందు రెండు భాగాలు  చేయాలనుకోలేదు. కానీ ఆయన గురించి చెప్పడానికి రెండు భాగాలు సరిపోవు. మేం ఆయన జీవిత సారాంశాన్ని తీసుకొని సందేసాత్మకంగా చిత్రీకరించాం. తెలుగు అనే మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎన్‌టి‌ఆర్ అనే మూడు అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్ దేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. కాబట్టి ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో, తమిళ్ లో అన్ని భాషల్లో డబ్ చేయబోతున్నాం. తెలుగు వాడి దెబ్బేంటో మళ్లీ చూపించాల్సిన అవసరముంది. ఈ సినిమా ద్వారా నా కోరికలన్నీ నెరవేర్చుకున్నాను. బ్యానర్ పెట్టి సినిమా తీయాలని ఎప్పుడో అనుకున్నాను కానీ కుదరలేదు. కానీ ఈ సినిమా రాసి పెట్టి ఉంది. అందుకే తీయగలిగాను.

రోజులో ఒక్కసారైనా నాన్నగారి సినిమాలు చూస్తుంటాను. ఆయనే నాకు బలం. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాలో అధ్బుతంగా నటించారు. కీరవాణి ఈ సినిమాకి అధ్బుతమైన బాణీలు అందించారు. సాయి మాధవ్ గారి డైలాగులు రియలిస్టిక్ గా ఉంటాయి. హరికృష్ణ అన్నయ్య తను అనుకున్నది సాధించే రకం.

ఎంత మొండోడో.. మనసు అంత సున్నితం. మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చేశారు. ఆయన అకాల మరణం శోకంలో ముంచేసింది. ఇప్పుడు అన్నయ్య పాత్రలో అతడి కొడుకు కల్యాణ్ రామ్ నటించాడు. ఇది కేవలం అభిమానుల సినిమా కాదు.. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా'' అంటూ వెల్లడించాడు.  

సంబంధిత వార్తలు.. 

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!