Asianet News Telugu

టీడీపిలో సంక్షోభం: పూర్తి కవరేజీ

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం
 

Top stories of the day
Author
Hyderabad, First Published Jun 20, 2019, 6:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు టీడీపీకి కొత్తకాదని చంద్రబాబునాయుడు స్పషం చేశారు. ఈ పరిణామాలతో అధైర్యపడొద్దని బాబు సూచించారు.
 

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

తాము డోర్లు తెరిస్తే  ఏపీలో టీడీపీ ఖాళీ అవుతోందని  బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ నేతలు కెప్టెన్ లేని షిప్ వంటిదని అభిప్రాయపడ్డారు.
 

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

బీజేపీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తామని తాము గతంలోనే చెప్పామన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తాము ఎవ్వరిని ఆకర్షించలేదని.. మోడీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగానే అనేక పార్టీల నేతలు తమ పార్టీపై చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
 

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో పాటు కాకినాడలో పార్టీ కాపునేతలు రహస్యంగా సమావేశమైన నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు.
 

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీపై కార్యకర్తలకు నమ్మకం పోయిందని మాజీ ఎంపీ, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు మార్గం సుగుమం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పురందేశ్వరి స్పందించారు.
 

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

టీడీపీ లో ముసలం మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కీలక నేతలు పార్టీలు మారుతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ సంఘటన పార్టీ కార్యకర్తలను కలవర పెడుతోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. తాము బీజేపీ అనుబంధ ఎంపీలుగా ఉంటామని తేల్చి చెప్పారు.
 

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు.రాజ్యసభలో నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చిన తరుణంలో  ఈ ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
 

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. గురువారం కాకినాడలో త్రిమూర్తులు అధ్యక్షతన టీడీపీ కాపునేతలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు.
 

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభం రానుందా...  ఏపీతో పాటు ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీలో గందరగోళానికి కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి  ఇప్పటికే రెండు దఫాలు ఆగష్టు సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ దఫా ఆగష్టు కంటే ముందుగానే టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
 

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కాకినాడలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి  రామ్‌మాధవ్ కొందరు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం. ఈ  చర్చలకు  కొనసాగింపుగానే గురువారం నాడు  టీడీపీ నేతలు సమావేశమైనట్టుగా ప్రచారం సాగుతోంది.
 

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

ఏపీలో తెలుగుదేశం పార్టీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. యూరప్ ట్రిప్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చే లోపు ఏపీలో టీడీపీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మెుత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఏపీలో టీడీపీని బీజేపీ ఊడ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 
 

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీకి అనుబంధంగా పయనించాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలైన సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేష్ లు బీజేపీకి అనుబంధంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 
 

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో   పలువురు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో  గురువారం నాడు సమావేశమయ్యారు. పలువురు టీడీపీ నేతలు భీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది.
 

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఈ వలసలు ఉంటాయన్నారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి రాష్ట్రానికి వచ్చేసరికి ఏపీ ముఖచిత్రం మారిపోతుందన్నారు.
 

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలకపదవి : టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్

ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రజల్లో టీడీపీ తరపున బలమైన వాయిస్ కోసం అన్వేషిస్తున్న టీడీపీ యువకుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 

ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడి కేసులో ట్విస్ట్: వీడియో విడుదల

హైదరాబాదులోని జుమేరాత్ బజార్ లో బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ పై పోలీసులు దాడి చేశారనే ఉదంతంలో ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. రాజాసింగ్ తనను తానే గాయపరుచుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. 
 

జుమ్మెరాత్ బజార్ లో పోలీసుల లాఠీచార్జ్ : ఎమ్మెల్యే రాజాసింగ్ కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

జుమ్మెరాత్‌ బజార్‌లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జుమ్మెరాత్ బజార్‌లోని స్థానికులంతా కలిసి రాణి అవంతిభాయ్‌ విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  
 

బంపర్ ఆఫర్: బిజెపిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపిలో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో బుధవారం రాత్రి హైదరాబాదులోని తన నివాసంలో ఆయన భేటీ అయ్యారు. 
 

మెగా ఫ్యామిలీపై గౌరవం ఉంది.. పుకార్లు నమ్మొద్దు.. కమెడియన్ పృథ్వి!

పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల వల్ల పృథ్వి చిత్ర పరిశ్రమలో అవకాశాలు కోల్పోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి పృథ్విని తొలగించారని వార్తలు వచ్చాయి. దీనిపై పృథ్వి తాజాగా వివరణ ఇచ్చాడు. 
 

ఆ ముగ్గురు హీరోలతో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ!

కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా షాలిని పాండేని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో కాస్త ఫేం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు.
 

లేడి సూపర్ స్టార్ ఇమేజ్ పోతుందా.. కొత్త చిక్కుల్లో నయనతార!

ఇటీవల నయనతార నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. తాను నటించిన కొన్ని చిత్రాలు కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం కూడా నయన్ కు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో తన ప్రియుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన సమస్యలు కూడా నయనతార మెడకు చుట్టుకుంటున్నాయి. 
 

నా జీవితాన్ని నరకం చేస్తున్నారు.. హృతిక్ సోదరి సంచలన కామెంట్స్!

కొద్దిరోజులుగా బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ ని కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది.
 

ఓ బేబీ ట్రైలర్: సమంత కామెడీ & ఎమోషనల్ ట్విస్ట్!

అక్కినేని వారి కోడలు సమంత చెప్పినట్టుగానే సరికొత్త చిత్రాలతో దర్శనమిస్తోంది. ఓ బేబీ సినిమాతో సమంత మరో సాలిడ్ హిట్ కొట్టేలా కనిపిస్తోంది. 70 ఏళ్ల బామ్మ వయసు నుంచి 24 ఏళ్ల పడుచు పిల్లలా కనిపించే స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ  చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
 

బ్లూ జర్సీ వదిలి.. ఆరెంజ్ జర్సీలోకి టీం ఇండియా

టీం ఇండియా జెర్సీ మారనుంది. ఇప్పటి వరకు టీం ఇండియా అంటే.. కేవలం బ్లూ కలర్ జెర్సీలో మాత్రమే కనపడేది. తొలిసారిగా ఆరెంజ్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ఇక నుంచి ఆరెంజ్ జెర్సీని మాత్రమే కంటిన్యూ చేస్తుంది అనుకుంటే పొరపాటే. కేవలం ఇంగ్లండ్ తో జరగబోయే మ్యాచ్ లో మాత్రమే టీం ఇండియా తన జెర్సీ రంగు మార్చుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు.
 

హోటల్ లో బుమ్రాతో.. హీరోయిన్ అనుపమ?

టీం ఇండియా క్రేజీ క్రికెటర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట ఓ చర్చకు దారి తీసింది. ఓ మహిళ బుజం మీద చెయ్యి వేసి నడుస్తుండగా.. వెనక నుంచి తీసిన ఫోటోని బుమ్రా షేర్ చేశాడు. 

 

ప్రపంచ కప్ కు దూరం... ఉద్వేగానికి లోనైన శిఖర్ ధవన్ (వీడియో)

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ  కప్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన  మ్యాచ్ లో ధవన్ తీవ్రంగా గాయపడి తాత్కాలికంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడి గాయం ఇప్పట్లో తగ్గేలా కనపించకపోవడంతో తాజాగా టోర్నీ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది. భారత ప్రపంచ కప్ జట్టునుండి ధవన్ ను పక్కకు తప్పిస్తున్నట్లు తాజాగా టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది. 
 

బ్యాటింగ్ చేస్తూ బ్యాలెన్స్ తప్పిన మార్టిన్ గుప్తిల్..వీడియో

ప్రపంచకప్ హోరులో భాగంగా బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. 

 

ధోనీ రిటైర్మెంట్ పై ఆసిస్ మాజీ క్రికెటర్ కామెంట్స్

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం వరల్డ్ కప్ లో తన సత్తా చాటుతున్నారు. అయితే.. ఈ ప్రపంచ కప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. కాగా.. ధోని రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్  స్పందించారు.

ప్రపంచకప్ హోరులో భాగంగా బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఓ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఔట్ అయిన విధానం అందరి చేత నవ్వులు పూయిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios