MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు

FASTag : వాహనదారులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు

FASTag Price Hike : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వార్షిక టోల్ పాస్ ధరలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి, దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడనుంది. కొత్త ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 13 2026, 11:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టోల్ పాస్ ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Image Credit : stockPhoto

టోల్ పాస్ ధరలు పెరిగాయ్.. కొత్త రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వార్షిక టోల్ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం, అంటే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ధరలతో పోలిస్తే, కొత్త ధరల ప్రకారం వాహనదారులు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ రూ. 3,000 నుండి రూ. 3,075కు పెంపు
Image Credit : stockPhoto

ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ రూ. 3,000 నుండి రూ. 3,075కు పెంపు

ప్రస్తుతం వ్యక్తిగత అంటే నాన్ కమర్షియల్ వాహనదారులకు అందుబాటులో ఉన్న వార్షిక టోల్ పాస్ ధర రూ. 3,000గా ఉంది. అయితే, NHAI తాజా మార్పుల ప్రకారం ఈ ధరను రూ. 3,075కు పెంచింది. అంటే నేరుగా రూ. 75 భారం వాహనదారులపై పడనుంది. ఈ పెంపు కేవలం సొంత వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఏటా టోల్ ధరల సమీక్షలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

36
FASTag Annual Pass : 200 ట్రిప్పులు ఫ్రీ
Image Credit : Google

FASTag Annual Pass : 200 ట్రిప్పులు ఫ్రీ

ఈ వార్షిక పాస్ వినియోగంలో కొన్ని కీలక నిబంధనలు ఉన్నాయి. ఈ పాస్ తీసుకున్న వాహనదారులు ఏడాది కాలంలో గరిష్ఠంగా 200 సార్లు టోల్ ప్లాజాల గుండా ప్రయాణించవచ్చు. ఒకవేళ ఏడాది పూర్తికాకముందే 200 ట్రిప్పులు పూర్తయితే, ఆ పాస్ గడువు ముగిసినట్లుగానే పరిగణిస్తారు. అప్పుడు వాహనదారుడు మళ్లీ కొత్తగా పాస్ తీసుకోవాల్సి ఉంటుంది లేదా సాధారణ టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది.

46
ఫాస్టాగ్ తప్పనిసరి
Image Credit : stockPhoto

ఫాస్టాగ్ తప్పనిసరి

వార్షిక టోల్ పాస్ సౌకర్యాన్ని పొందాలంటే సదరు వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉండటం తప్పనిసరి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతతో పనిచేసే ఈ ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి. వాహనం విండ్‌షీల్డ్‌కు అతికించిన ఈ స్టిక్కర్‌ను సెన్సార్లు స్కాన్ చేసి, లింక్ చేసిన అకౌంట్ నుండి నేరుగా మనీని తీసుకుంటాయి. వార్షిక పాస్ తీసుకున్న వారికి ఈ ట్రిప్పుల లెక్కింపు ఆటోమేటిక్‌గా జరుగుతుంది.

56
FASTag Annual Pass : ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Image Credit : AI Generated Image

FASTag Annual Pass : ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ప్రయాణికుల సౌకర్యార్థం NHAI ఈ పాస్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది.

1. రాజ్‌మార్గ్ యాత్ర (Rajmarg Yatra) యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

2. మీ ఫాస్టాగ్ వివరాలతో లాగిన్ అవ్వాలి.

3. వాహన రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.

4. కొత్త ధర రూ. 3,075ను యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.

చెల్లింపు పూర్తయిన 24 గంటల్లో పాస్ యాక్టివేట్ అవుతుంది.

66
ప్రయాణ సమయం.. రద్దీ తగ్గింపు
Image Credit : iSTOCK

ప్రయాణ సమయం.. రద్దీ తగ్గింపు

టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే ఈ వార్షిక పాస్ ప్రధాన ఉద్దేశమని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే తెలిపారు. సింగిల్ ట్రాన్సాక్షన్‌తో ఏడాది పొడవునా ప్రయాణించే వెసులుబాటు కలగడం వల్ల ప్లాజాల వద్ద వివాదాలు, ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ప్రతిపాదించిన రూ. 30,000 లైఫ్ టైమ్ పాస్ ప్లాన్‌ను ప్రభుత్వం పక్కన పెట్టి, ఈ వార్షిక ప్లాన్‌ను అమలు చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image2
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Recommended image3
రూ. 25 వేల‌కి పెరిగిన పీఎఫ్ సాల‌రీ లిమిట్‌.. దీంతో ఉద్యోగుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కంటే పనిమనిషి జీతమే ఎక్కువ.. ఏడాదికి 4.8 లక్షల సంపాదన సామీ !
Recommended image2
Kavya Maran : భారత్ అంటే పడని పాక్ ఆటగాడికి కోట్ల రూపాయలా? బీసీసీఐ ఏం చెప్పింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved